CM Rekha Gupta: మహిళలకు రూ.2,500 సాయంపై సీఎం కీలక ప్రకటన

మహిళలకు రూ.2,500 సాయంపై ఆప్‌ నిలదీయంతో సీఎం రేఖా గుప్తా స్పందించారు. గతంలో ఉన్న ఆప్‌ ప్రభుత్వ ఢిల్లీ ఖజానాను పూర్తిగా ఖాళీ చేసిందని ధ్వజమెత్తారు. అయినప్పటికీ కూడా తాము ఈ పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు.

New Update
Delhi CM Rekha Gupta

Delhi CM Rekha Gupta

ఢిల్లీ ఎన్నికల్లో తాము గెలిస్తే మహిళా సమృద్ధి యోజన పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని బీజేపీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్కీమ్‌ ఎప్పుడు అమలు చేస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీని ప్రశ్నించింది. దీంతో సీఎం రేఖాగుప్తా దీనిపై ఘటుగా స్పందించారు. గతంలో ఉన్న ఆప్‌ ప్రభుత్వ ఢిల్లీ ఖజానాను పూర్తిగా ఖాళీ చేసిందని ధ్వజమెత్తారు. అయినప్పటికీ కూడా తాము ఈ పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. 

Also Read: దేశ విభజన తర్వాత పాక్‌తో ఫస్ట్ టైం బంగ్లాదేశ్ వ్యాపారం

మహిళా సమృద్ధి యోజన నిరంతరంగా సాగే ప్రక్రియన అని.. సరైనా ప్రణాళికతో దీన్ని తప్పకుండా తీసుకొస్తామని పేర్కొన్నారు.  ఈ స్కీమ్ కింద పేద కుటుంబాలకు చెందిన మహిళలకు ప్రతినెల రూ.2500 ఆర్థిక సాయం అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అలాగే గర్బిణీలకు సైతం రూ.21 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పింది. 

Also Read: ఫ్రీగా కుంభమేళా ట్రిప్.. రూపాయి ఖర్చు పెట్టకుండా 1500KM ప్రయాణం

ఇదిలాఉండగా.. మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం పథకంపై చర్చించేందుకు ఆదివారం 'ఆప్' లెజిస్లేటివ్ డెలిగేషన్‌తో మీటింగ్ ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నేత అతిషి సీఎంకు లేఖ రాశారు. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో మహిళలకు రూ.2500 ఇస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఫిబ్రవరి 20న జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో ఈ స్కీమ్‌ను ఆమోదించలేదని.. తాము మోసపోయామని ఢిల్లీ ప్రజలు అనుకుంటున్నట్లు లేఖలో రాసుకొచ్చారు. ఈ క్రమంలోనే సీఎం రేఖా గుప్తా దీనిపై స్పందించారు. 

Also Read: కనీస మద్దతు ధరకు రూ.30వేల కోట్లు కేటాయించండి.. రైతుల డిమాండ్

Also Read: మైనర్‌ బాలికలు శృంగారం చేస్తే తప్పుకాదు.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు