/rtv/media/media_files/2026/04/09/raghav-chadha-2026-04-09-18-59-02.jpg)
AAP leader Raghav Chadha hints at floating Gen-Z party
ఇటీవల పార్లమెంటులో కీలక ప్రశ్నలను లేవనెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. నెటిజన్ల నుంచి ఆయనకు మంచి సపోర్ట్ వచ్చింది. కానీ ఆప్.. ఆయన్ని డిప్యూటీ లీడర్‌గా తొలగించి షాకిచ్చింది. దీంతో ఆయన సొంతంగా పార్టీ పెట్టాలని కోరుతూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అయితే తాజాగా రాఘవ్ చద్దా షేర్ చేసిన ఇన్‌స్టా పోస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయమవుతోంది.
Also read: అసోం, కేరళ, పుదుచ్చేరిలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు.. ఓటింగ్ శాతం ఎంతంటే ?
ఇక వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రాఘవ్ చద్దా తన ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేశారు. అందులో ఓ యువకుడూ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాఘవ్ చద్దా వేరే పార్టీలో చేరడం కన్నా సొంతంగా జెన్‌జెడ్ పార్టీ లాంటి పేరుతో ఓ పార్టీని ప్రారంభిస్తే మంచిదని చెప్పాడు. యువత మీకు ఎప్పటికీ సపోర్ట్‌గా ఉంటుందని.. మీరే గెలుస్తారంటూ సలహా ఇచ్చారు. ఈ వీడియోను రాఘవ్ చద్దా రీపోస్ట్ చేస్తూ ఆసక్తికర ఆలోచన అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఆయన కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
Also Read: పురుషులకూ అనుమతి లేని ఆలయాలున్నాయ్.. ‘శబరిమల’ అంశంపై కేంద్రం కీలక ప్రకటన
ఇటీవల రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాను తొలగించాకా ఆప్‌తో ఆయనకు దూరం పెరుగుతూ వస్తోంది. మరోవైపు ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు ఊహాగాణాలు వస్తున్నాయి. అయితే ఒకవేళ రాఘవ్ చద్దా నిజంగానే పార్టీ ప్రారంభిస్తే బలమైన కేడర్, నిధులు, అలాగే క్షేత్రస్థాయిలో నిర్మాణం అవసరం ఉంటుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాది పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాఘవ్ చద్దా రాజ్యసభ సభ్యత్వం 2028 సెప్టెంబర్ దాకా ఉంది. దీంతో ఆయన కొత్త పార్టీ పెడుతారా ? లేదా ? అనేదానిపై ఆసక్తి నెలకొంది.
Follow Us