జమ్మూ కాశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సంచలన నిర్ణయం

J&K లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 2(C)తో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నారని, ఆయుధాలు అందిస్తున్నారని ఆ ముగ్గురిపై ఆరోపణలు ఉన్నాయి.

New Update
lieutenant governor

lieutenant governor Photograph: (lieutenant governor)

కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నారని ముగ్గురు ప్రభుత్వ అధికారులను ఉద్యోగం నుంచి తొలగించాలని ఆదేశించారు. ఈ మేరకు గురువారం వారిని జాబ్‌లో నుంచి తీసేస్తున్నట్లు ఉత్తర్వులపై సంతకం చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 2(C)  కింద గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఆ ముగ్గురిలో ఒకరు పోలీస్ కానిస్టేబుల్, టీచర్, అటవీ శాఖలో అధికారి ఉన్నారు.

Also Read :  మరో బ్యూటీతో లలిత్ మోదీ రాసలీలలు.. లవర్స్ డే స్పెషల్ పోస్ట్.. ఆ అందగత్తే ఎవరో తెలుసా!

పోలీస్ కానిస్టేబుల్ ఫిర్దౌస్ అహ్మద్ భట్, టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న మొహమ్మద్ అష్రఫ్ భట్ మరియు అటవీ శాఖలో ఆర్డర్లీ నిసార్ అహ్మద్ ఖాన్‌ లపై గతంలోనే అనేక కేసులు ఉన్నాయి. ప్రస్తుతం  ఉగ్రవాద కేసుల్లో ఫిర్దౌస్ కోట్ బల్వాల్ జైలు, అష్రఫ్ రియాసి జిల్లా జైలులో ఉన్నారు. నిసార్ గతంలో ప్రజా భద్రతా చట్టం (PSA) కింద ఎనిమిది నెలలు నిర్బంధంలో ఉన్నారు. పాక్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాదులకు వీరు ఆయుధాలు చేకుర్చడం, జమ్మూకాశ్మీర్ ముస్లీంలను రెచ్చగొట్టడం వంటివి చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Also Read: ఆ విషయంలో భర్త బలవంతం చేసినా తప్పుకాదు: హైకోర్టు

లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన గురువారం జమ్మూలో భద్రతా సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశం తర్వాత గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వారికి వీరు సహాయం చేస్తున్నారని, జమ్మూ, కాశ్మీర్ లో ఏర్పాటు వాదులను రెచ్చగొడుతున్నారని సమాచారం ఉంది.

Advertisment
Advertisment
Advertisment