/rtv/media/media_files/2025/03/21/htri4pPfqtUnGEBWZzyb.jpg)
Digital Arrest
డిజిటల్ అరెస్టులపై సైబర్ క్రైమ్ పోలీసులు, ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఈ మోసాలు ఆగడం లేదు. ఇప్పటికీ సైబర్ నేరగాళ్లు కొందరు అమయాకులకు వల వేసి డిజిటల్ అరెస్టులు చేస్తున్నారు. లక్షలు, కోట్లు కాజేస్తున్నారు. తాజాగా మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధురాలిని డిజిటల్ అరెస్టు పేరుతో ఆమెను ఇంట్లో బంధించి ఏకంగా రూ.20 కోట్లకు పైగా కాజేశారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
Also Read: వికలాంగురాలిపై లైంగిక దాడి చేయించిన భర్త.. ఒకేసారి ఐదుగురు కలిసి!
ఇక వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని దక్షిణ ముంబయికి చెందిన వృద్ధురాలికి (86) గత ఏడాది డిసెంబర్ 26న ఫోన్ చేశాడు. సీబీఐ అధికారినంటూ చెప్పాడు. నగదు అక్రమ చలామణి వ్యవహారంలో మీ ఖాతా నుంచి కార్యకలాపాలు జరిగాయని... మీరు డిజిటల్ అరెస్టు అయ్యారంటూ నమ్మించారు. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని హెచ్చరించారు. దీనిపై మేము దర్యాప్తు చేపట్టామని.. ప్రతి మూడు గంటలకు ఒకసారి మిమ్మల్ని తనిఖీ చేస్తామని చెప్పాడు. లేకపోతే మీ పిల్లలు అరెస్టవుతారని బెదిరించారు.
Also Read: ఆపరేషన్ హిడ్మా.. 125కు పైగా గ్రామాలను చుట్టుముట్టిన బలగాలు.. అడవిలో హైటెన్షన్!
ఆ వృద్ధురాలు వాళ్లని నమ్మింది. చివరికి వాళ్లు చెప్పినట్లుగా విడుతల వారీగా డబ్బులు చెల్లించింది. రెండు నెలల పాటు ఆమెను నిర్బంధించిన సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.20.26 కోట్లు కాజేశారు. గతేడాది డిసెంబర్ 26 నుంచి ఈ ఏడాది మార్చి 3 వరకు ఆమె డిజిటల్ అరెస్టయ్యింది. చివరికి తాను మోసపోయినట్లు గ్రహించిన ఆ వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు వివిధ ఖాతాలకు బదిలీ అయిపోయిన బాధితురాలి నగదులో రూ.77 లక్షలు స్తంభింపజేశారు. ఆ తర్వాత ముంబయిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: వేలంలో రూ.118 కోట్లు పలికిన ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్.. ఇందులో అంత ప్రత్యేకత ఏంటో తెలుసా?