/rtv/media/media_files/2025/02/24/CUHc8OlydRnmtS6nVIeM.jpg)
3 in 5 individuals in India die after cancer diagnosis
భారత్‌లో క్యాన్సర్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే దేశంలో ప్రతీ ఐదుగురు క్యాన్సర్ రోగుల్లో ముగ్గురు ఈ వ్యాధి వల్లే చనిపోతున్నట్లు ప్రపంచ క్యాన్సర్ డేటా విశ్లేషణలో తేలింది. ఇందులో పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నట్లు బయటపడింది. అమెరికాలో చూసుకుంటే ప్రతీ నలుగురు క్యాన్సర్ రోగుల్లో ఒకరు మరణిస్తున్నారు. చైనాలో ఇద్దరిలో ఒకరు మరణిస్తున్నట్లు ది లాన్సెట్ 'రీజనల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఆసియా' జర్నల్‌లో వెల్లడించారు.
Also Read: తమిళనాడులో హిందీ భాష వివాదం.. బోర్డులపై నల్ల రంగు పూస్తున్న డీఎంకే కార్యకర్తలు
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) అధ్యయనం ప్రకారం చైనా, అమెరికా తర్వాత క్యాన్సర్ బాధితుల సంఖ్య భారత్‌లోనే ఎక్కువ అని తెలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాల్లో చూసుకుంటే 10 శాతం భారత్‌లోనే నమోదవుతున్నాయి. ఆ తర్వాత స్థానంలో చైనా ఉంది. రాబోయే 20 ఏళ్లలో భారత్‌లో క్యాన్సర్ మరణాలు తగ్గించడం సవాలుగా మారనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జనాభా వయస్సు పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ కేసులు కూడా క్రమంగా ప్రతీ సంవత్సరం 2 శాతం వరకు పెరుగుదల ఉన్నట్లు తేలింది.
Also Read: ఏం పుట్టుకరా మీది.. మహాకుంభమేళాలో మహిళల వీడియోలకు రేటు.. ఒక్కో వీడియోకు..
భారత్‌లో మహిళలు ఎక్కువగా క్యాన్సర్‌కు గురవుతున్నారు. రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు దాదాపు 30 శాతం నమోదవుతున్నాయి. ఇందులో 24 శాతానికి పైగా మరణాలు జరుగుతున్నాయి. ఇక గర్భాశయ క్యాన్సర్ కేసులు 19 శాతం ఉంది. ఇందులో 20 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. పురుషుల్లో చూసుకుంటే నోటి క్యాన్సర్ ఎక్కువగా నమోదవుతోంది. ప్రతి సంవత్సరం 16 శాతం కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీని తర్వాత శ్వాసకోశ క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్ తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఇక మధ్య వయస్కులు, వృద్ధుల్లో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ 8 నుంచి 10 శాతంగా ఉందని.. సర్వేలో తేలింది. దాదాపు 70 శాతం క్యాన్సర్ మరణాలు మధ్య వయస్కులు, వృద్ధుల్లోనే జరుగుతున్నాయి.