/rtv/media/media_files/2025/04/10/obRgJQhS6GKiQ3nlJNo8.jpg)
26/11 Mumbai attacks mastermind Tahawwur Rana successfully extradited, Says NIA
ముంబయి ఉగ్రదాడి సూత్రదారి తహవ్వుర్ హుస్సేన్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకొచ్చి సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అయ్యింది. అయితే రాణాను అదుపులోకి తీసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అధికారులు.. పటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు.
Also Read: భార్యపై అనుమానంతో బాత్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా.. టెక్ బిలియనీర్ కేసులో భయంకర నిజాలు!
ముందు జాగ్రత్తగా కోర్టు ప్రాంగాణాన్ని పోలీసులు పూర్తిగా ఖాళీ చేయించారు. అలాగే మీడియాను కూడా బయటకు పంపించేశారు. రాణాను తీహార్ జైలుకు తరలించనున్నట్లు తెలుస్తోంది. రాణాను అదుపులోకి తీసుకున్నట్లు ఎన్‌ఐఏ అధికారికంగా ప్రకటించింది. అతడిని చట్టం ముందుకు తీసుకొచ్చేందుకు ఏళ్ల తరబడి కృషి చేస్తున్నామని పేర్కొంది. ఎన్‌ఐతో పాటు ఎన్‌ఎస్‌జీ, భారత విదేశాంగ శాఖ, హోంశాఖ, యూఎస్ డీఓజే, అమెరికాలోని సంబంధిత అధికారుల వల్ల ఈ ప్రక్రియ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయ్యిందని తెలిపింది.
— NIA India (@NIA_India) April 10, 2025
Also Read: బిర్యానీ పెట్టి పడుకోపెట్టొద్దు.. వెంటనే ఉరి తీయండి: రాణాకు వ్యతిరేకంగా నిరసనలు!
ఇదిలాఉండగా ఈ కేసు NIA తరఫున సీనియర్ అడ్వకేట్ దయన్ కృష్ణన్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ మాన్ హాజరయ్యారు. ఇప్పటికే వీళ్లిద్దరూ కూడా కోర్టు ప్రాంగణానికి వచ్చారు. ఈ కేసు గురించి వాళ్లు మాట్లాడేందుకు నిరాకరించారు. ఇక నిందితుడు తహవ్వుర్ రాణా తరఫున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి పీయూష్ సచ్‌దేవ హాజరైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇప్పుడు రాణా ఎన్‌ఐఏ అధికారుల అదుపులోనే ఉన్నాడు. దీనికి సంబంధించిన ఒక ఫొటో కూడా వైరల్ అవుతోంది.
Also Read: హర్యానా బీజేపీ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ MLA వినేష్ ఫొగట్‌కు రూ.4 కోట్లు
Also Read: డిప్యూటీ ప్రధానిగా నితీశ్ కుమార్ !.. బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు
Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు
జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ భగవత్ స్పందించారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోందని అన్నారు. పాకిస్థాన్ తప్పు చేసింది కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు.
Mohan Bhagwat
జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ భగవత్ స్పందించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. '' పొరుగు దేశాలతో తమకు గొడవలు, యుద్ధం అవసరం లేదు. శాశ్వత శాంతి కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. కానీ వాళ్లు ఉగ్రదాడులు చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు దాడులతో సంబంధం లేదని చెబుతున్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోంది. పాకిస్థాన్ తప్పు చేసింది. కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే.
Also Read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్ ఫిక్స్..! పాక్ మాజీ హైకమిషనర్ సంచలన కామెంట్స్
ఆరోజు రాముడు కూడా.. రావణాసురుడిని రాజ్య ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చంపారు. కానీ అది హింస కాదు. ఎవరైనా మాత్రం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అది తప్పు అని చెప్పి.. సరైన మార్గంలో నడిపించడమే రాజు బాధ్యత. ఇప్పుడు రాజు తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతాడని'' మోహన్ భగవత్ అన్నారు.
Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..
అలాగే ఈ దాడి దేశ ప్రజలను ఎంతో వేదనకు గురిచేసిందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మనకు బలం లేకపోతో వేరే మార్గాన్ని ఎంచుకునే వాళ్లమని.. ఇప్పుడు మనం బలవంతులం కాబట్టి తప్పకుంటా మన బలమేంటో చూపించాలని మోహన్ భగవత్ అన్నారు.
Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్ గాంధీ
Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!
mohan-bhagwat | attack in Pahalgam
Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్
భర్త మెచ్చిన అర్ధాంగిలో ఉండాల్సిన లక్షణాలివే!
🔴India - Pakistan War Live Updates: ఏ క్షణమైనా భారత్ -పాకిస్థాన్ యుద్ధం లైవ్ అప్డేట్స్!
Omar Abdullah: పాక్ ప్రధానిపై ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
KKR Vs PBKS: కేకేఆర్‌కు బిగ్ షాక్.. పంజాబ్ కింగ్స్ భారీ టార్గెట్..