Holidays: బ్యాంకులకు నెలలో సగంపైనే హాలిడేస్... ఎంజాయ్ డిసెంబర్ డిసెంబర్‌లో మీ బ్యాంకు పనులు పూర్తి చేసుకుందాం అనుకుంటున్నారా...అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. వచ్చే నెలలో బ్యాంకులు సగం రోజులు మాత్రమే పని చేయనున్నాయి. మొత్తం 17 రోజులు బ్యాంకులు పని చేయవు. By Manogna alamuru 30 Nov 2024 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి డిసెంబర్ నెల...ఈ నెల అందరికీ జాలీ మంత్. చాలా మంది ఉద్యోగులకు ఈ నెలలో సెలవులు ఉంటాయి. ఈ ఏడాది ఈ లిస్ట్‌లో బ్యాంకు ఉద్యోగులు కూడా చేరుతున్నారు. డిసెంబర్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులున్నాయి. నెలలో కేవలం 15 రోజులు మాత్రమే పని చేయనున్నాయి. పండుగలు, జాతీయ, ప్రాంతీయ సెలవులతోపాటు వివిధ ఆచారాలకు సంబంధించిన రోజుల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు సెలవులు ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. డిసెంబర్ నెలలో మొత్తం నెలలో సగం రోజులకు పైనే సెలవు దినాలుగా ఆర్బీఐ ప్రకటించింది. ఇది కూడా చూడండి: నాగ చైతన్య - శోభిత మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్ ఉందా? వచ్చే నెలలో బ్యాంకులలో పనులు పెట్టుకున్న వారు సెలవులకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటే మంచిది. తీరా అక్కడకు వెళ్ళాక సెలవు అని తెలిస్తే అనవసరమైన టైమ్ వేస్ట్. ఇది కూడా చూడండి: బిగ్ ట్విస్ట్ ! పృథ్వీ, నబీల్ ఎలిమినేటెడ్.. టాప్ 5 వీళ్ళే సెలవు రోజులు... డిసెంబర్ 1 - ఆదివారం (పాన్ ఇండియా)డిసెంబర్ 3 - మంగళవారం - సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ (గోవా) పండుగడిసెంబర్ 12 - గురువారం పా-టోగన్ నెంగ్మింజా సంగ్మా (మేఘాలయ)డిసెంబర్ 14 - రెండో శనివారం (పాన్ ఇండియా)డిసెంబర్ 15 - ఆదివారం (పాన్ ఇండియా)డిసెంబర్ 18 - బుధవారం - యు సోసో థామ్ వర్ధంతి (మేఘాలయ)డిసెంబర్ 19 - గురువారం - గోవా విమోచన దినం (గోవా)డిసెంబర్ 22 - ఆదివారం (పాన్ ఇండియా)డిసెంబర్ 24 - మంగళవారం - క్రిస్మస్ పండుగ (మిజోరం, నాగాలాండ్ మరియు మేఘాలయ)డిసెంబర్ 25 - బుధవారం - క్రిస్మస్ (పాన్ ఇండియా)డిసెంబర్ 26 - గురువారం - క్రిస్మస్ వేడుకలు (మిజోరం, నాగాలాండ్ మరియు మేఘాలయ)డిసెంబర్ 27 - శుక్రవారం - క్రిస్మస్ వేడుకలు (మిజోరం, నాగాలాండ్, మేఘాలయ)డిసెంబర్ 28 - నాలుగో శనివారం (పాన్ ఇండియా)డిసెంబర్ 29 - ఆదివారం (పాన్ ఇండియా)డిసెంబర్ 30 - సోమవారం - యు కియాంగ్ నంగ్బా (మేఘాలయ)డిసెంబర్ 31 - మంగళవారం - నూతన సంవత్సర వేడుకలు / లోసాంగ్ / నమ్సోంగ్ (మిజోరాం, సిక్కిం) ఇది కూడా చూడండి: చెన్నై ఎయిర్‌పోర్టు మూసివేత.. ఎందుకో తెలుసా ? అయితే ఇవి ఆయా రాష్ట్రాలను బట్టి నిర్ణయించిన సెలవులు. కాబట్టి కస్టమర్లు తాము ఉన్న ఏరియాను బట్టి హాలిడే షెడ్యూల్‌ను చూసుకోవాలి. మిగతా వివరాల కోసం స్థానిక బ్యాంకును సంప్రదిస్తే మంచిది. Also Read: Cricket: అతనే నా క్రికెట్ దేవుడు...వైభవ్ సూర్యవంశీ #december #banks #holidays మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి