/rtv/media/media_files/2025/04/11/c1stVOxwlgzG6dZ2zi1D.jpg)
Tahawwur Rana With NIA Officials
ముంబయి ఉగ్రదాడి నిందితుడు తహవ్వుర్ రాణా ప్రస్తుతం జాతీయ దర్యాప్తు (NIA) కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు నిఘా ఏర్పాటు చేశారు. అతడి కదలికలను నిరంతరం గమనిస్తున్నారు. అలాగే అతడి నుంచి కీలక సమాచారాన్ని సేకరించనున్నారు. రాణాను ఎన్ఐఏ అదుపులోకి తీసుకోవడం వల్ల సీజీఓ కాంప్లెక్స్‌లో భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు.
Also Read: ఇదొక విచిత్రమైన లవ్ స్టోరీ.. ఫ్యాన్ రిపేర్ కోసం వచ్చి పాపను పడేశాడు!
Tahawwur Rana
ఆ కాంప్లెక్స్‌లోనే ఎన్‌ఐఏ భవనం ఉంది. దాని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న గదిలో రాణాను ఉంచారు. 14*14 అడుగుల వైశాల్యం ఉన్న గదిలో అతడు ఉన్నాడు. అతడిపై 24 గంటల నిఘా కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ గదిలో డిజిటల్ సెక్యూరిటీ సిస్టమ్ కూడా ఉంది. రాణా పడుకునేందుకు నేలపైనే బెడ్ వేశారు. ఈ రూమ్‌లో బాత్రూర్ కూడా ఉంది. ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అన్నీ ఆ గదికే వస్తాయని తెలుస్తోంది. పర్మిషన్ లేకుండా ఎవరూ లోపలికి వెళ్లడానికి వీలు లేదు. కేవలం 12 మంది NIA అధికారులకు మాత్రమే పర్మిషన్ ఉంది.
Also Read: స్కూల్ బ్యాగ్‌లో కండోమ్స్, తంబాకు ప్యాకెట్లు, కత్తులు, అగ్గిపెట్టలు.. ఎవర్రా మీరంతా!
ఇదిలాఉండగా మంబయి ఉగ్రదాడి కేసులో నిందితుడిగా ఉన్న రాణాను అమెరికా నుంచి ఇండియాకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గురువారం రాత్రి విమానం ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. ఆ తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ అధికారులు ఢిల్లీలోని పటియాలా హౌస్‌కోర్టు ప్రత్యేక జడ్జి ముందు హాజరుపరిచారు. రాణాను 20 రోజుల కస్టడీకి పర్మిషన్ ఇవ్వాలని NIA కోరింది. దీంతో న్యాయమూర్తి 18 రోజుల కస్టడీకి పర్మిషన్ ఇచ్చింది. ప్రస్తుతం అతడిపై విచారణ జరుగుతోంది.
Also Read: బిగ్ బ్రేకింగ్...తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకే పొత్తు ఖరారు
Also Read : రేపు హనుమాన్ శోభాయాత్ర... ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
rtv-news | Tahawwur Rana | national-news