/rtv/media/media_files/2025/01/13/8W6jEtsKTpZ6xv0IzbVl.jpg)
maha kumbh mela 2025
Maha Kumbh: ప్రయాగ్ రాజ్(Prayagraj) లో జరుగుతున్న కుంభమేళాకు కోట్లలో ప్రజలు తరలివెళుతున్నారు. ఇందులో చిన్న పిల్లలు, గర్భిణులు లాంటి వారు కూడా ఉంటున్నారు. ఇలా వెళ్ళినవారిలో కొంతమందికి అక్కడే ప్రసవం అవుతోంది. ఇప్పటివరకు కుంభమేళాకు వచ్చిన వారికి అక్కడ ఆసుపత్రిలో 12 మంది శిశువులు జన్మించారు. అవన్నీ సాధారణ ప్రసవాలే కావడం మరో విశేషం. ఈ 12 డెలివరీల్లో పలువురు మగ, ఆడ శిశువులు జన్మించినట్లు డాక్టర్లు చెప్పారు. ఈ పిల్లలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించారు యూపీ ఆరోగ్యశాఖ అధికారులు.
Also Read : బస్సు ప్రమాదంలో చనిపోయిన మహిళకు రూ.9 కోట్ల పరిహారాన్ని చెల్లించాల్సిందే
Also Read : అవినీతి కేసులో అదానీకి ఊరట...ట్రంప్ సంచలన నిర్ణయం
నదులు, శివుని పేర్లు..
మహా కుంభమేళాలో పుట్టిన పిల్లలకు వెంటనే నామకరణం చేశారు. ఇప్పుడు ఆ పేర్లే దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్నాయి. ఇందులో ఆడపిల్లలకు బసంతి, గంగ, జమున, బసంత్ పంచమి, సరస్వతి లాంటి పేర్లు పెట్టారు. అదే మగ పిల్లలకు కుంభ్, భోలేనాథ్, బజ్ రంగీ, నంది లాంటి పేర్లు పెట్టినట్టు మహా కుంభ్ నగర్‌లోని సెంట్రల్ ఆస్పత్రి అధికారులు తెలిపారు.
144 ఏళ్లకు ఒకసారి ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో ఈ మహా కుంభమేళాను నిర్వహిస్తారు. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ్ నగర్ మొత్తం భక్త కోటితో పులకించిపోతుంది. జనవరి 13వ తేదీన ప్రారంభం అయిన మహా కుంభమేళాలో ఇప్పటివరకు కోట్ల మంది ప్రజలు పుణ్యస్నానాలు చేశారు. గత 28 రోజుల్లో 45 కోట్ల మంది గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ కుంభమేళా మరికొన్ని రోజుల్లో...ఈ నెల 26వ తేదీన మహాశివరాత్రితో ముగుస్తోంది. దీని కోసం దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.
Also Read: USA: అవినీతి కేసులో అదానీకి ఊరట...ట్రంప్ సంచలన నిర్ణయం
Also Read: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు ఇదే.. స్టార్ బౌలర్లు ఔట్!