రూ.70తో మొదలైన క్రికెట్ కెరీర్, రూ.7 కోట్ల స్థాయికి..అద్భుతంగా రాణిస్తున్న హైదరాబాద్ పేస్ బౌలర్‌

హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ క్రికెట్ ఫేస్‌ బౌలర్ మహ్మద్ సిరాజ్, ఇప్పుడెక్కడ చూసిన మనోడి పేరే వినిపిస్తుంది.అంతేకాదు సిరాజ్ ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తున్నాడు.ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్ టెస్టులో అద్భుతంగా బౌలింగ్‌లో రాణిస్తూ హౌరా అనిపిస్తున్నాడు. వర్షం ఆటను చెడగొట్టింది కానీ లేకపోతే టెస్ట్ సిరీస్‌లో భారత్ 2-0తో విజయాన్ని కైవసం చేసుకునేది.టీమిండియా మ్యాచ్ కైవసం చేసుకోలేకపోవచ్చు.కానీ మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్లు తీసి క్రికెట్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకున్నాడు.టెస్టు కెరీర్‌లో అద్భుతంగా రాణించి తొలిసారిగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నాడు.

New Update
రూ.70తో మొదలైన క్రికెట్ కెరీర్, రూ.7 కోట్ల స్థాయికి..అద్భుతంగా రాణిస్తున్న హైదరాబాద్ పేస్ బౌలర్‌

national-sports-cricket-india-mohammed-siraj-turning-into-face-bowler-real-life-struggles-in-cricket-match

త్వరలో బీసీసీఐ వార్షిక కాంట్రాక్టును ప్రకటించనుంది.ఈ క్రమంలో మహ్మద్ సిరాజ్ (Mohammad Siraj) ప్రమోషన్ కూడా ఫిక్స్ అయిందని టాక్(Talk) వినిపిస్తోంది. కాగా ప్రస్తుతం సిరాజ్‌ మూడు ఫార్మట్లలో అదరగొడుతున్నాడు. ముఖ్యంగా గత ఏడాది(Last Year) నుంచి అతను బౌలింగ్ (Bowling) చేస్తూ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇక ఈ ఏడాది ముప్పైకి పైగా వికెట్లు (Wickets) తీసి సిరాజ్‌ ఖాతాలో వేసుకున్నాడు.దీంతో బీసీసీఐ అతడిని 'ఏ+' కేటగిరీలోకి తీసుకొవచ్చని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ఈ డీల్ (Deal) కనుక ఓకే అయితే అతని కాంట్రాక్ట్ రూ.7 కోట్లు (7Crores) పలకనుంది.ఇది కాకపోయినా 'ఏ' కేటగిరీ సిరాజ్‌కి ఇస్తే రూ.5 కోట్లు మనోడి చేతికి వస్తాయి. ప్రస్తుతం సిరాజ్‌ 'బి'గ్రేడ్‌లో రూ.3 కోట్లు అందుకుంటున్నాడు.ఈ ఏడాది మహమ్మద్ సిరాజ్ ప్రమోషన్ ఫిక్స్ కావడం ఖాయమంటూ క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.

తన క్రికెట్ కెరీర్(Cricket Career) రూ. 70తో మొదలై..

national-sports-cricket-india-mohammed-siraj-turning-into-face-bowler-real-life-struggles-in-cricket-match

అయితే ఒకప్పుడు మ్యాచ్ ఆడితే మహ్మద్ సిరాజ్‌కి రూ.70 రూపాయలు మాత్రమే వచ్చేవట. ఆర్థికంగా బాగా వెనుకబడిన కుటుంబం(Economical Background) నుంచి వచ్చిన మహ్మద్ సిరాజ్.తన చిన్నతనంలో క్రికెట్ ఆడినందుకు చాలా తిట్లు తినాల్సి వచ్చిందట.దీంతో రహస్యంగా క్రికెట్ ఆడాల్సి వచ్చేదట.అయితే తన మేనమామ సపోర్ట్‌తో క్రికెట్‌ మ్యాచ్‌లకు వెళ్లేవాడట.అప్పట్లో మ్యాచ్ ఆడితే సిరాజ్ కు 70 రూపాయలు మాత్రమే చేతికి వచ్చేవట.అయితే ఇందులో రూ.60 రూపాయలు(60 Rupees) పెట్రోల్‌కే ఖర్చు అయ్యేవని తన కెరీర్‌లో ఎన్నో సమస్యల నుంచి బయటపడి ఈ స్థాయికి చేరుకున్నానని సిరాజ్ తెలిపారు.

బుమ్రా స్థానంలోకి సిరాజ్ వచ్చే ఛాన్స్…

national-sports-cricket-india-mohammed-siraj-turning-into-face-bowler-real-life-struggles-in-cricket-match

ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా (Jusprit Bumra), మహ్మద్ షమీ (Mohammad Shami) స్థిరంగా రాణించడం లేదు.పైగా గాయాలతో సతమతమవుతున్నారు.ఈ క్రమంలో టీమిండియా ఫాస్ట్‌ బౌలింగ్‌కు (Team India Fast Bowler) సిరాజే నాయకత్వం వహిస్తున్నాడు.ఇక రేపటి నుంచి విండీస్‌తో భారత్‌ వన్డే సిరీస్‌ (India One Day Series) ఆడనుంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న ప్రపంచకప్‌ (World Cup) దృష్ట్యా ఇప్పుడు ఈ ఫార్మాట్‌లో జరిగే మ్యాచ్‌లన్నీ చాలా కీలకం. ఈ క్రమంలో సిరాజ్ సత్తా చాటేందుకు రెడీ (Ready) అవుతున్నాడు. మొత్తానికి సిరాజ్ తన కెరీర్‌ని చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఇండియన్ క్రికెట్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. అంతేకాకుండా విమర్శకుల మనసులు గెలిచి తన టాలెంట్‌తో తనకంటూ ఒక మార్క్‌ను సృష్టించుకున్నాడు. రానున్న యువ క్రికెటర్లకు తన ఆటతో ఆదర్శంగా నిలుస్తున్నాడు. తాజాగా తన కొత్త ఇంటికి ఇండియన్ టీంని ఆహ్వానించాడు. టీం మొత్తం హైదరాబాద్‌లోని సిరాజ్ కొత్త ఇంటికి వచ్చి సందడి చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు