Maharastra: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంలకు తప్పిన పెను ప్రమాదం

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్‌ పవార్‌ ఓ కార్యక్రమం కోసం గడ్చిరోలి వెళ్తుండగా.. ప్రతికూల వాతావరణ వల్ల వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ దారి తప్పింది. చివరికి పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.

New Update
Maharastra: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంలకు తప్పిన పెను ప్రమాదం

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్‌ పవార్‌కు పెను ప్రమాదం తప్పింది. ఓ కార్యక్రమం కోసం గడ్చిరోలి వెళ్తుండగా.. ప్రతికూల వాతావరణ వల్ల వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ దారి తప్పింది. చివరికి పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర డిప్యూటీ సీఎంలు అజిత్‌ పవార్‌, దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు పరిశ్రమలశాఖ మంత్రి ఉదయ్‌ సామంత్‌ విమానంలో నాగ్‌పూర్‌ నుంచి గడ్చిరోలికి బయలుదేరారు. అయితే హెలికాప్టర్‌ టేకాఫ్‌ అయిన కాసేపటికే ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీంతో హెలికాప్టర్ దారి తప్పింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి హెలికాప్టర్‌ను సురక్షితంగా ల్యాండ్ చేశారు. అయితే ఈ సమయంలో ఆందోళన చెందినట్లు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అన్నారు.

Also Read:  ప్రైవేటు సంస్థల్లో స్థానికుల రిజర్వేషన్‌ బిల్లును నిలిపివేసిన కర్ణాటక సర్కార్..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు