Chai Pe Charcha : కృత్రిమ మేధ మీద చాయ్ పే చర్చా..బిల్ గేట్స్‌తో ప్రధాని మోదీ

కృత్రిమ మేథ నుంచి విద్య, వ్యవసాయం దాకా అన్నీ మట్లాడేసుకున్నారు ప్రధాని మోదీ, టెక్ దిగ్గజం బిల్ గేట్స్. భారత్‌లో టెక్నాలజీ అభివృద్ధిని బిల్‌గేట్స్‌కు మోదీ వివరించి చెప్పారు. ఈరోజు ప్రధాని నివాసంలో బిల్‌గేట్స్ తో మోదీ చాయ్ పే చర్చాలో పాల్గొన్నారు.

New Update
Chai Pe Charcha : కృత్రిమ మేధ మీద చాయ్ పే చర్చా..బిల్ గేట్స్‌తో ప్రధాని మోదీ

PM Modi With Bill Gates : మైక్రోసాఫ్ట్(Microsoft) వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈరోజు భారత ప్రధాని మోదీ నివాసానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. వీరిద్దరూ కలిసి ఛాయ్ పే చర్చా(Chai Pe Charcha) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ దగ్గర నుంచి వ్యవసాయం దాకా అన్ని విషయాల గురించి చర్చించారు. ముఖ్యంగా కృత్రిమ మేథ, భారతదేశం లో ఏఐ టెక్నాలజీ(AI Technology) అభివృద్ధిని మోదీ బిల్‌గేట్స్‌కు వివరించారు. సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. దాంతో పాటూ ఫోటో బూత్ ఆప్షన్‌తో బిల్ గేట్స్‌తో సెల్‌పీ కూడా దిగారు ప్రధాని మోదీ.

ఏఐ టెక్నాలజీని వాడుతున్నాం...

సాంకేతికకు తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని బిల్‌గేట్స్‌కు తెలిపారు ప్రధాని మోదీ. ముఖ్యంగా తాను టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో ఎప్పుడూ ముందుంటానని తెలిపారు. అందులో తాను నిపుణుడిని కాపోయినా...కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తిని చూపిస్తానని మోదీ అన్నారు. జీ20 సదస్సులో ఏఐ టెక్నాలజీని వినియోగించుకున్నాం. కృత్రిమ మేధతో హిందీలో చేసిన నా ప్రసంగాన్ని తమిళం, తెలుగుల్లోకి అనువదించామని తెలిపారు. అయితే సవ్యంగా ఉపయోగిస్తే ఏఐ బావుంటుంది కానీ మ్యాజిక్ టూల్‌గా ఉపయోగిస్తే మాత్రం అనరాధాలే జరుగుతాయని అన్నారు. డీప్ ఫేక్‌తో తన గొంతును కూడా అనుకరించారని మోదీ తెలిపారు. ఏఐ సృష్టించే కంటెంట్‌కు వాటర్ మార్క్ ఉంటే ఏది నిజం, ఏది అబద్ధం అనేది కచ్చితంగా తెలుస్తుంది కదా అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మనం మొదటి దశలో ఉన్నాం...

ప్రధాని మోదీ(PM Modi) కి బదులిస్తూ... ఏఐ వినియోగంలో ప్రపంచం ఇంకా మొదటి దశలోనే ఉందని అన్నారు బిల్‌గేట్స్. కొత్త టెక్సాలజీతో చాలా కష్టమైన పనులు సులువుగా అవుతున్నాయి. ప్రపంచానికి ఏఐ చాలా పెద్ద వరం కానీ దాంతో చాలా సవాళ్ళు కూడా ఉన్నాయని చెప్పారు. వీటిని అధిగమించడానికి మరికొంత సమయం పడుతుందని తెలిపారు.

దీని తరువాత భారతదేశం(India) లో విద్య, వ్యసాయ రంగాలతో పాటూ పలు రంగాల గురించి కూడా మాట్లాడుకున్నారు ప్రధాని మోదీ, బిల్‌గేట్స్. డిజిటల్ సాంకేతికత సామస్య ప్రజల్లో ఎలా భాగం అ వుతఓందో మోదీ బిల్‌గేట్స్‌కు వివరించారు. సైకిళ్ళు తొక్కడం రాని మహిళలు ఇప్పుడు పైలట్లుగా ,డ్రోన్ ఆపరేటర్లుగా ఎదిగారని తెలిపారు. చిన్న రైతులు ఏరకంగా అభివృద్ధి చెందారో వివరించారు. చిరు ధాన్యాల వల్ల కలుగుతున్న ప్రయోజనాలు...అవి రైతులకు అందిస్తఉన్న లాభాల గురించి తెలిపారు.

నమో సెల్ఫీ...

చివరగా మైక్రోసాఫ్ట్ అధినేతకు ప్రధాని మోదీ బోలెడు కానుకలు ఇచ్చారు. మట్టి బొమ్మల దగ్గర నుంచి కాశ్మీరీ పశ్మీనా శాలువా..చేతితో తయారు చేసిన సెంటు బాటిల్ లాంటివి కానుకగా ఇచ్చారు. ఈ సందర్భంలోనే నమో యాప్‌లో సెల్ఫీ గురించి కూడా తెలిపారు. ఇందులో ఏఐ టెక్నాలజీతో ఒక వ్యక్తి పాత ఫోటోలను ఎలా రిట్రీవ్ చేస్తుందో వివరించారు. బిల్‌గేట్స్‌తో పాటూ సెల్పీ తీసుకుని వచ్చిన పాత ఫోటోలను చూపించారు మోదీ. తన ఫోన్‌ను స్వయంగా ఇచ్చి బిల్‌గేట్స్‌ను సెల్ఫీ దిగమన్నారు.

Also Read : Telangana: పోరాట పంథాలో కదం తొక్కుతాం.. ఉద్యమ రోజులను గుర్తుకు తెస్తూ జంపింగ్ లపై కేటీఆర్ ట్వీట్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. దేశంలో జరిగే అన్ని విషయాలపైనా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె..తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని చెప్పారు. 

New Update
Renu Desai

Renu desai

తనకు రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఇంతకు ముందే వచ్చిందని..కానీ పిల్లలు చిన్నవారు కావడం వలన వదులుకున్నానని చెప్పారు రేణూ దేశాయ్. రాజకీయాల్లోకి వెళ్ళడం తన జాతకంలోనే ఉందని అన్నారు. ఇప్పటికీ తనకు అదే కోరికని...కానీ తాను విధి రాతకు వ్యతిరేకంగా ప్రయాణిస్తున్నానని చెప్పుకొచ్చారు రేణు. ఓ పాడ్ కాస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో మాటను బయటపెట్టారు.  సామాజిక సేవ చేయడం అంటే తనకు ఆనందమని...ఏ చిన్నారీ ఆకలితో ఉండకూడదని అనుకుంటానని ఆమె తెలిపారు. అయితే తాను కొంచెం ముక్కు సూటి మనిషిని...స్నేహితులు, పిల్లలతో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తానని...అందుకే వారు తాను పోలిటిక్స్ లో పనికి రానని అంటారని నవ్వూతూ చెప్పారు రేణూ దేశాయ్. 

మోడీ భక్తురాలిని..బీజేపీకే సపోర్ట్..

తాను ఎప్పటికీ మోడీనే సపోర్ట్ చేస్తానని...ఆమె భక్తురాలిని అని నిర్భయంగా చెప్పుకున్నారు రేణు. మన ధర్మం ఎలా బతకాలో, ఎలా నడుచుకోవాలో నేర్పించింది. అందుకే నేను సనాతురాలినే అని చెప్పుకుంటాననన్నారు ఎవరేం అనుకున్నా ఎప్పటికీ తాను బీజేపీకే సపోర్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులా తాను ఏదైనా పార్టీలో చేరితే కచ్చితంగా అందరికీ చెప్పే చేస్తానని రేణూ దేశాయ్ అన్నారు. ఇక ఆమె కుమారుడు అకీరా నందన్ గురించి చెబుతూ...ఓజీ సినిమాలో అతను పని చేయడం లేదని తెలిపారు. అకీరా నటన గురించి ఆలోచించిన రోజే నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెడతా. కొందరు యూట్యూబర్లు మనీ కోసం తప్పుడు థంబ్‌నైల్స్‌ పెడుతున్నారు రేణూ ఆరోపించారు. 

today-latest-news-in-telugu | renu-desai | actress | inter-view

Also Read: WHO: మరో మహమ్మారి తప్పదు-WHO చీఫ్

Advertisment
Advertisment
Advertisment