Chandrababu Arrest: సిట్ కార్యాలయానికి లోకేష్, భువనేశ్వరి.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు అధికారులు. అయితే, చంద్రబాబును సిట్ కార్యాలయానికి తీసుకువచ్చిన నేపథ్యంలో ఆయన తనయుడు నారా లోకేష్, భార్య భువనేశ్వరి సిట్ కార్యాలయానికి వెళ్లారు. By Shiva.K 09 Sep 2023 in గుంటూరు టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Chandrababu Naidu Arrest: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు(Chandrababu Naidu)ని అరెస్ట్ చేసి తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు అధికారులు. అయితే, చంద్రబాబును సిట్(SIT Office) కార్యాలయానికి తీసుకువచ్చిన నేపథ్యంలో ఆయన తనయుడు నారా లోకేష్, భార్య భువనేశ్వరి సిట్ కార్యాలయానికి వెళ్లారు. చంద్రబాబును కలిసేందుకు లోకేష్, భువనేశ్వరి ప్రయత్నించారు. అయితే, చంద్రబాబును కలిసేందుకు వారిని ఇంకా అనుమతించలేదు అధికారులు. చంద్రబాబు 5వ ఫ్లోర్‌లో ఉండగా.. లోకేష్, భువనేశ్వరిని 4వ ఫ్లోర్‌లో కూర్చోబెట్టారు అధికారులు. వీరినే కాదు.. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు తరఫున వాదించనున్న అడ్వకేట్లను కూడా లోపలికి అనుమతించలేదు పోలీసులు. Your browser does not support the video tag. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం నంద్యాలలో బాబును అరెస్ట్ చేసిన పోలీసులు.. మధ్యాహ్నం సమయానికి తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఇక్కడ ఆయన్ను ఈ కేసుకు సంబంధించి విచారించనున్నారు అధికారులు. ఇప్పటికే 20 ప్రశ్నలు సిద్ధం చేసుకుంది సీఐడీ.. ఆ మేరకు ఆయనను విచారిస్తోంది. Your browser does not support the video tag. గవర్నర్ అపాయింట్‌మెంట్ వాయిదా.. టీడీపీ నేతలకు గవర్నర్ ఇచ్చిన అపాయింట్‌మెంట్ వాయిదా పడింది. వాస్తవానికి ఇవాళ రాత్రి 7 గంటల తరువాత అచ్చెన్నాయుడితో కూడిన బృందానికి గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. కానీ, ఆ భేటీ వాయిదా పడింది. ఆదివారం ఉదయం 9 గంటలకు గవర్నర్‌ను కలవనున్నారు టీడీపీ నేతలు. సిట్ కార్యాలయం వద్దకు చేరుకున్న నారా భువనేశ్వరి గారు, లోకేష్ గారు #WeWillStandWithCBNSir#ChandrababuNaidu#G20India2023#StopIllegalArrestOfCBN#PsychoJagan#AndhraPradesh #FalseCasesAgainstNaidu#SelfGoalByJagan pic.twitter.com/VAXQmFgDpz — Telugu Desam Party (@JaiTDP) September 9, 2023 Your browser does not support the video tag. చంద్రబాబును చూసి కన్నీళ్లు పెట్టుకున్న భువనేశ్వరి.. Also Read: Chandrababu Arrest: సిట్ కార్యాలయానికి బాబు.. 20 ప్రశ్నలతో సిద్ధంగా సీఐడీ.. Pawankalyan: బేగంపేటలో పవన్ కల్యాణ్ విమానానికి అనుమతి నిరాకరణ #andhra-pradesh #nara-lokesh #andhra-pradesh-news #nara-bhuvaneshwari మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి