Nara Bhuvaneshwari: చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదు: నారా భువనేశ్వరి

చంద్రబాబు నాయుడు ఎలాంటి తప్పు చేయలేదని, రాత్రి పగలు ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అని చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి అన్నారు. ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్‌ద్వారా అనేక మంది ఉద్యోగులు లక్షల్లో జీతాలు పొందుతున్నారని ఆమె గుర్తు చేశారు. ఈ విషయం తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసన్నారు.

New Update
Nara Bhuvaneshwari: చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదు: నారా భువనేశ్వరి

చంద్రబాబు నాయుడు ఎలాంటి తప్పు చేయలేదని, రాత్రి పగలు ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అని చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి అన్నారు. ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్‌ద్వారా అనేక మంది ఉద్యోగులు లక్షల్లో జీతాలు పొందుతున్నారని ఆమె గుర్తు చేశారు. ఈ విషయం తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసన్నారు. ఎలాంటి తప్పు చేయని తన భర్తను 17 రోజుల నుంచి జైల్లో నిర్భందిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.తన కుటుంబానికి ప్రజల సొమ్ము అవసరం లేదన్నారు. తాను సొంతంగా నడుపుకుంటున్న కంపెనీలో 2 శాతం అమ్ముకున్నా తనకు 400 కోట్లు వస్తాయన్నారు.

తన తండ్రి నందమూరి తారక రామారావు తనకు మానవుడే దేవుడు మనుషులే దేవుళ్ళు అని చెప్పారని భువనేశ్వరి గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ స్పూర్తితోనే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ను స్థాపించారన్నారు. మా కుటుంబం అంతా ఎన్టీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తున్నామని తెలిపారు. మరోవైపు పోలీసులపై ఫైర్ అయిన భువనేశ్వరి.. పోలీసులు ఐటీ ఉద్యోగులను ఎందుకు నిర్భందిస్తున్నారని ప్రశ్నించారు. ఐటీ ఉద్యోగులను ఏమైనా టెర్రరిస్టులా అన్నారు. ఐటీ ఉద్యోగులు రాష్ట్రానికి రావాలంటే వీసా పాస్‌ పోర్ట్ కావాలా అని ఆమె ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ ఇండియాలో లేదా అన్నారు.

చంద్రబాబు నాయుడు రాళ్ల రప్పల మధ్య ఐటెక్ సిటీని నిర్మించారన్న భువనేశ్వరి.. ఇప్పుడు అది సైబారాబాద్‌గా మారిందన్నారు. అప్పటి చంద్రబాబు నాయుడి ఆలోచన తీరు వల్ల ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెడుతోందన్నారు. విజన్ 2020ని చంద్రబాబు 10 సంత్సరాల ముందే స్థాపించారన్నారు. చంద్రబాబు నాయుడు ఒక్క ఐటీ రంగాన్నే కాకుండా అన్ని రంగాలను అభివృద్ధి చేశారని ఆమె తెలిపారు. మహిళలు అంటే ఓ శక్తి అన్న భువనేశ్వరి.. తాను ఓ ఝాన్సీ లక్ష్మిభాయ్‌లా పోరాటం చేస్తానన్నారు. ఏపీ ప్రభుత్వం తన భర్తను అనవసరంగా రెచ్చగొడుతొందన్న నారా భువనేశ్వరీ.. రాష్ట్ర ప్రజలు వారి ఓటును వారు కాపాడుకోవాని సూచించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Explosives Case : వైసీపీకి షాక్‌..పేలుడు పదార్థాల నిల్వ కేసులో వైసీపీ నేత అరెస్ట్

అక్రమంగా పేలుడు పదార్థాలను నిల్వచేసిన వైసీపీ నేతను పోలీసులు అరెస్టు చేశారు. సుమారు రూ.20 లక్షల విలువైన జిలిటెన్‌ స్టిక్స్, డిటోనేటర్లు, ఇతర సామగ్రి, ఓ వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో వైసీపీ నేత దాసం హనుమంతరావుతో పాటు మరొకరిని అరెస్ట్‌ చేశారు.

New Update
Explosives Case

Explosives Case

Explosives Case : అక్రమంగా పేలుడు పదార్థాలను నిల్వచేసిన వైసీపీ నేతను పోలీసులు అరెస్టు చేశారు. సుమారు రూ.20 లక్షల విలువైన జిలిటెన్‌ స్టిక్స్, డిటోనేటర్లు, ఇతర సామగ్రి, ఓ వాహనం స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల జిల్లా మార్టూరు మండలం నాగరాజుపల్లి పంచాయతీ పరిధిలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను అక్రమంగా నిల్వ ఉంచిన కేసులో వైసీపీ నేత దాసం హనుమంతరావుతో పాటు మరొకరిని అరెస్ట్‌ చేశారు. బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్టూరు మండలం నాగరాజుపల్లిలో పొలాల్లో ఉన్న ఓ గోదామును  దాసం హనుమంతరావు కొన్నేళ్లుగా సబ్‌ లీజుకు తీసుకొని అందులో పేలుడు పదార్థాలు నిల్వ చేస్తున్నారు. నిజానికి పేలుడు పదార్థాల నిల్వకు హనుమంతరావు గతంలో అనుమతి తీసుకున్నప్పటికీ అది గతనెల 31న ముగిసింది. అయినప్పటికీ పేలుడు పదార్థాల నిల్వను కొనసాగిస్తూ వస్తున్నాడు.

Also Read:  Zelensky: చెప్పుకోవడానికే కాల్పుల విరమణ..దాడులు మాత్రం ఆగడం లేదు!


కాగా తెలంగాణ రాష్ట్రం మేడ్చల్‌ జిల్లా కేంద్రంగా బిల్లులు లేకుండా పేలుడు పదార్ధాలు విక్రయిస్తున్న సాల్వో ఇండస్ట్రీ్‌స్‌ నుంచి ఈనెల 19న అక్రమంగా పేలుడు పదార్థాలు తీసుకొచ్చినట్లు పోలీసులకు తెలిసింది.దీంతో రైడ్‌ చేయగా  క్వారీల్లో పేలుళ్లకు ఉపయోగించే 5,000 కేజీల పేలుడు పదార్ధాలు, 2,300 ఈడీలు లభ్యమయ్యాయి.  అక్కడే ఉన్న నిందితుడు హనుమంతరావునూ అదుపులోకి తీసుకున్నారు. దీనిపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ చేయాలని జిల్లా ఎస్పీని హోంమంత్రి అనిత ఆదేశించారు. గత ప్రభుత్వంలో జరిగిన పేలుళ్ల ఘటనలతో ఏళ్ల తరబడి ఇదే వ్యాపారంలో ఉన్న వైసీపీ నేత సహకారం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయాలన్నారు. హనుమంతరావుతోపాటు దాసం వీరాంజనేయులు, నాగండ్ల ప్రసన్న, బత్తుల సాంబశివరావు, ప్రతాప్‌రెడ్డి, సాల్వో పరిశ్రమపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. 

Also Read: మహిళా కమిషన్ లాగే.. పురుషులకు ప్రత్యేక కమిషన్ కావాలని డిమాండ్

విచారణకు హోంమంత్రి ఆదేశం 


మార్టూరు, బల్లికురవ ప్రాంతాల్లో వైకాపా నేతలు కొందరు అక్రమంగా పేలుడు పదార్థాలు కలిగి ఉన్నారన్న దానిపై హోంమంత్రి అనిత విచారణకు ఆదేశించారు. గ్రానైట్‌ వ్యాపారం ముసుగులో జిలిటెన్‌ స్టిక్స్‌ టన్నుల కొద్దీ తరలిస్తున్నట్లు వెలుగుచూడటంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

Also Read: Pavani Reddy : మొదటి భర్త ఆత్మహత్య.. రెండో పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ!

Also Read: Prakasam: క్రికెట్ గ్రౌండ్‌లో పిడుగుపాటు.. చెట్టుకిందికెళ్లిన ఇద్దరు బాలురు మృతి

Advertisment
Advertisment
Advertisment