Mukhtar Ansari : 'మా నాన్నకు విషం ఇచ్చి చంపేశారు': ఉమర్ అన్సారీ ఉత్తరప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే, గ్యాంగ్‌స్టర్ ముఖ్తర్ అన్సారీ(60) జైలులో ఉండగా గురువారం గుండెపోటుతో మృతి చెందారు. తన తండ్రికి విషయం కలిపిన ఆహారం ఇచ్చి చంపేశారని ఆయన కుమారుడు ఉమర్ అన్సారీ ఆరోపించారు. ఈ విషయంలో తాము కోర్టుకు వెళ్తామన్నారు. By B Aravind 29 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Umar Ansari : ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత, గ్యాంగ్‌స్టార్ ముఖ్తర్ అన్సారీ(Mukhtar Ansari) (60) జైలులో ఉండగా గురువారం గుండెపోటు(Heart Stoke) తో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే తాజాగ ఆయన కుమారుడు ఉమర్ అన్సారీ తన తండ్రి మరణంపై సంచలన ప్రకటన చేశారు. తన తండ్రికి ఆహారంలో విషం ఇచ్చి చంపేశారని ఆరోపించారు. ఈ విషయంలో తాము కోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. ' రెండు రోజుల క్రితమే మా నాన్నను కలవడానికి జైలుకువచ్చాను. కానీ సిబ్బంది నన్ను అనుమతించలేదు. ఆయనకు స్లో పాయిజన్(Slow Poison) ఇచ్చినట్లు ఇంతకు ముందు కూడా చెప్పాం. ఇప్పుడ కూడా ఇచ్చారని చెబుతున్నాం. మార్చి 19న మా నాన్నకు ఆహారంలో విషం కలిపి ఇచ్చారు. మేము కోర్టుకు వెళ్తామని' ఉమర్ అన్సారీ తెలిపారు. Also Read : ఘోర ప్రమాదం.. 10 మంది మృతి అయితే ముఖ్తర్ అన్సారీ యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్(UTI) కు గురయ్యారు. ఆ తర్వాత ఆయన్ని ఆస్పత్రిలో ఐసీయూకి తరలించారు. డాక్టర్లు ఆయనకు శస్త్రచికిత్స చేసిన తర్వాత మళ్లీ జైలుకు తరలించారు. ఐసీయూ నుంచి వార్డుకు మార్చకుండా తన తండ్రిని జైల్లో పెట్టారంటూ ఉమర్ ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి 21న ముఖ్తర్ అన్సారీ.. తన ఆరోగ్యం క్షీణించిందని, మార్చి 19న తనకు విషం కలిపిన ఆహారాన్ని ఇచ్చారని బరాబంకి కోర్టుకు అప్లికేషన్ పెట్టారు. ఈ ఆహారం తినడం వల్ల తనకు నొప్పులు రావడం మొదలయ్యాని పేర్కొన్నారు. 40 రోజుల క్రితం కూడా తన ఆహారంలో స్లో పాయిజన్ కలిపారని.. తనతో పాటు అది తిన్న జైలు సిబ్బంది కూడా అస్వస్థకు గుర్యయారని చెప్పారు. బండా జైలులో తనకు ప్రమాదం ఉందని.. మార్చి 19న కూడా కుట్రతో తనకు విషం కలిపిన ఆహారాన్ని ఇచ్చారని కోర్టుకు ఇచ్చిన అప్లికేషన్లో తెలిపారు. ఇలా ఇచ్చిన కొన్ని రోజులకే ముఖ్తర్ ఆసుపత్రి పాలయ్యారు. గురువారం గుండెపోటుతో మృతి చెందారు. ఇదిలాఉండగా.. తన తండ్రికి శుక్రవారం పోస్టుమార్టం చేసి ఆ తర్వాత భౌతికకాయాన్ని అప్పగిస్తారని ఉమర్ అన్సారీ తెలిపారు. ఆ తర్వాత తదుపరి కార్యక్రమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. మరోవైపు బండా మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ముఖ్తర్ అన్సారీకి శవ పరీక్ష కూడా చేశారు. ఆయన మృతిపై పలువురు రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు. Also Read : అగ్నిపథ్‌లో మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం : రాజ్‌నాథ్ సింగ్ #telugu-news #national-news #uttar-pradesh #mukhtar-ansari #umar-ansari మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి