Reliance JIO : మరో సంచలనానికి తెరలేపుతున్న రిలయన్స్..అందరి ఫోకస్ 5జీ ఫోన్ల మీదే..!!

రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపనుంది. జియో నుంచి త్వరలోనే కొత్త డివైస్ మార్కెట్లోకి లాంచ్ కానుంది. రేపు (ఆగస్టు 28) సోమవారం జరగనున్న కంపెనీ వార్షిక సదస్సుల్లో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ దీనికి అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ డివైస్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

New Update
Reliance JIO : మరో సంచలనానికి తెరలేపుతున్న రిలయన్స్..అందరి ఫోకస్ 5జీ ఫోన్ల మీదే..!!

Reliance JIO : భారత టెలికాం మార్కెట్లో మార్కెట్లో సంచలనం క్రియేట్ చేసిన రిలయన్స్ జియో (Reliance Jio) మరో సరికొత్త సంచలనం క్రియేట్ చేయనుంది. కొత్తగా ఫిక్డ్స్ వైర్ లెస్ యాక్స్ డివైస్ ను విడుదల చేయనుంది. దీని పేరు జియో ఎయిర్ ఫైబర్ ( Jio Air Fiber) అని పెట్టారు. రానున్న పండగల సీజన్లో మార్కెట్లోకి తీసుకురావడమే లక్ష్యం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర డివైస్ ల కంటే జియో ఎయిర్ ఫైబర్ 20శాతం డిస్కౌంట్ అందించాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం.

జియో ఎయిర్ ఫైబర్ గురించిన సమాచారాన్ని రిలయన్స్ జియో గతేడాది AGM సమావేశంలో అందించింది. ఈ డివైజ్ కోసం జియో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎజిఏం 2022(AGM 2022) తర్వాత, జియో ఎయిర్ ఫైబర్ (Jio Air Fiber )కి సంబంధించి జియో( Jio) ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇప్పుడు ఈ డివైస్ తో నిరీక్షణను ముగించడం ద్వారా కంపెనీ రేపు దీన్ని అధికారికంగా ప్రారంభించనుంది.

ఇది కూడా చదవండి :  ఓడిపోయినా..రికార్డు సృష్టించిన ప్రణయ్..!!

రేపటి ఈవెంట్ రిలయన్స్ 46వ AGM ఈవెంట్. ఈ ఈవెంట్‌లో రిలయన్స్ చాలా ప్రకటనలు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే అందరి చూపు జియో ఎయిర్ ఫైబర్ ( Jio Air Fiber) డివైస్ మీదే ఉంది. ఇందులో, వినియోగదారులు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని పొందవచ్చు. ఈ ఈవెంట్‌లో కంపెనీ జియో ఫోన్, జియో 5G డేటా ప్లాన్‌ను కూడా ప్రారంభించవచ్చు. జియో ఎయిర్ ఫైబర్ డివైస్ పోర్టబుల్ పరికరంగా ఉండనుంది. పేరు సూచించినట్లుగా, ఈ డివైస్ మనకు వైర్లు లేకుండా వైర్‌లెస్‌గా ఇంటర్నెట్ యాక్సెస్‌ను అందిస్తుంది. జియో ఇందులో 5G యాంటెన్నాను ఉపయోగిస్తుందని, తద్వారా వినియోగదారులు వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని పొందుతారని కంపెనీ పేర్కొంది. జియో ఎయిర్ ఫైబర్ తో మనం 1Gbps వరకు వేగవంతమైన వేగాన్ని పొందవచ్చు.

ఇది కూడా చదవండి:రామయ్య దర్శనం కాకుండానే.. బహిరంగ సభకు అమిత్‌షా

ప్రస్తుతం, జియో ఎయిర్ ఫైబర్ డివైస్ ధర ఇంకా వెల్లడించలేదు. అయితే మనం జియో ట్రాక్ రికార్డ్‌ను పరిశీలిస్తే, కంపెనీ దానిని చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంచుతుంది. ఈ పరికరంలో అనేక రకాల కనెక్టివిటీ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. మీరు జియో ఎయిర్ ఫైబర్‌లో సిమ్‌ని అలాగే దానిలోని సెట్-టాప్ బాక్స్‌ను ఉపయోగించగలరు.

Advertisment
Advertisment
తాజా కథనాలు