విశాఖలో విషాదం.. నీటి సంపులోకి దూకి ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య

మర్రిపాలెంలోని ప్రకాష్ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో సంధ్య దంపతులు గత కొంత కాలంగా నివాసం ఉంటున్నారు. ఆమె భర్త అపార్ట్ మెంట్ కి వాచ్ మెన్ గా విధులు నిర్వహిస్తుండగా.. మృతురాలు సంధ్య అపార్ట్ మెంట్ లో ఏవో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేది. వీరికి గౌతమ్(9), అలేఖ్య(5) అనే కూతురు, కొడుకు ఉన్నారు. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ.. మంగళవారం అర్థరాత్రి అపార్ట్ మెంట్ లోని నీటి సంపులో ఇద్దరు పిల్లలతో పాటు తాను దూకి ఆత్మహత్యకి పాల్పడింది..

New Update
సికింద్రాబాద్‎లో విషాదం.. ఇద్దరు కూతుర్లను చంపి తండ్రి ఆత్మహత్య..!!

ఇద్దరు పిల్లలతో పాటు తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన విశాఖపట్టణంలో చోటు చేసుకుంది. మర్రిపాలెంలోని ప్రకాష్ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో సంధ్య దంపతులు గత కొంత కాలంగా నివాసం ఉంటున్నారు. ఆమె భర్త అపార్ట్ మెంట్ కి వాచ్ మెన్ గా విధులు నిర్వహిస్తుండగా.. మృతురాలు సంధ్య అపార్ట్ మెంట్ లో ఏవో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేది. వీరికి గౌతమ్(9), అలేఖ్య(5) అనే కూతురు, కొడుకు ఉన్నారు. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ.. మంగళవారం అర్థరాత్రి అపార్ట్ మెంట్ లోని నీటి సంపులో ఇద్దరు పిల్లలతో పాటు తాను దూకి ఆత్మహత్యకి పాల్పడింది.

అయితే అర్థరాత్రి నుంచి పిల్లలు, సంధ్య కనబడకపోవడంతో భర్త ఆందోళనకు గురయ్యాడు. వెంటనే అందరికీ సమాచారం అందించాడు. తీరా అపార్ట్ మెంట్ లోని నీటి సంపు డోర్ తీసి ఉంచడంతో అనుమానం వచ్చి అందులో వెతకగా.. మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో వెంటనే డెడ్ బాడీస్ ని బయటకు తీసి.. పోలీసులకు సమాచారం అందించారు. సంధ్య మరణంతో కుంటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

అయితే సంధ్యకి, ఆమె భర్తకి ఎలాంటి తగాదాలు లేవని, ఆర్థికంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని అపార్ట్ మెంట్ వాసులు చెబుతున్నారు. పిల్లల్ని స్కూల్ కి పంపించే ఆటో అబ్బాయితో.. సంధ్య సన్నిహితంగా ఉండటం రెండు మూడు సార్లు చూశామని.. ఇది కరెక్ట్ కాదని హెచ్చరించినట్లు వారు చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఇలా ఆమెతో పాటు ఏమీ తెలియని చిన్న పిల్లల్ని కూడా చంపడం దారుణమని అపార్ట్ మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఇక ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం సంధ్య భర్తని, ఆటో డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతదేహాలను బయటకు తీసి కేజీహెచ్ కు తరలించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ లింక్ ఇదే

ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. అభ్యర్థులు తమ ఫలితాలను https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. వీటితో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను కూడా విడుదల చేశారు.

New Update
Tenth results

Tenth results

ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను కూడా విడుదల చేశారు. అభ్యర్థులు తమ ఫలితాలను https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే 81.14 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మే 19 నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. 


100 శాతం ఫలితాలు సాధించిన 1680 పాఠశాలలు ఉన్నాయి. అయితే ఇందులో అబ్బాయిలు 78.31 శాతం పాస్ కాగా.. అమ్మాయిలు 84.09 శాతం ఉత్తీర్ణత సాధించారు. కేవలం వెబ్‌సైట్ మాత్రమే కాకుండా వాట్సాప్ నంబర్ 9552300009 కు హాయ్ అని మెసేజ్ చేసినా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. 

Advertisment
Advertisment
Advertisment