Isreal Hamas War: పాలస్తీనాకు మద్దతుగా లండన్‌లో 8 లక్షల మంది నిరసనలు.. లండన్‌లో పాలస్తీనాకు మద్దతుగా లక్షలాది మంది నిరసనలు చేశారు. శనివారం అక్కడ పాలస్తీనాకు మద్దతుగా నిరసనలు చేసిన వారిని పోలీసులు అరెస్టు చేయడంతో దీన్ని ఖండిస్తూ.. లక్షలాది మంది పాలస్తీనాకు స్వేచ్ఛ ఇవ్వాలని, ఇజ్రాయెల్ వెంటనే దాడులు ఆపాలంటూ నినదిస్తూ నిరసనలు చేశారు. By B Aravind 12 Nov 2023 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమపై దాడులు చేసిన హమాస్‌ను అంతం చేయాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ గాజాపై వైమానిక దాడులు చేస్తూ విరుచుకుపడుతుంది. ఇప్పటికే ఈ భీకర దాడుల్లో వేలాదిమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికే ఈ దాడులను ఆపాలని పలు దేశాలు కోరినప్పటికీ.. ఇవి ఆగడం లేదు. కొన్ని దేశాలు ఇజ్రాయెల్‌కు సపోర్ట్ చేస్తుంటే మరికొన్ని పాలస్తీనాకు మద్దతుగా నిలుస్తున్నాయి. అంతేకాదు ఆయా దేశాల్లో కూడా ఈ వివాదంపై నిరసనలు, ర్యాలీలు చేస్తున్నారు. అయితే లండన్‌లోని తాజాగా లక్షలాది మంది పౌరులు పాలస్తీనాకు మద్దతుగా అక్కడ ర్యాలీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. లండన్‌లో ఏటా నవంబర్ 11న మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన సందర్భంగా ఈ యుద్ధంలో అమరులైన బ్రిటన్ సైనికులను స్మరించుకునేందుకు 'ఆర్మిస్టైస్ డే'ను జరుపుకుంటారు. అయితే శనివారం జరిగిన ఈ ఆర్మిస్టైస్ డే సందర్భంగా.. దానికి అంతరాయం కలిగిస్తూ కొంతమంది పాలస్తీనాకు మద్దతుగా నిరసనలు చేశారు. దీంతో పోలీసులు నిరసనలు చేసిన 82 మందిని అరెస్టు చేశారు. అయితే ఈ అరెస్టులను ఖండిస్తూ లక్షలాది మంది పాలస్తీనాకు మద్దతుగా ర్యాలీ చేశారు. పాలస్తీనాకు స్వేచ్ఛ ఇవ్వాలని.. ఇజ్రాయెల్ దాడులను వెంటనే ఆపాలంటూ నినాదాలు చేశారు. అయితే పోలీసులు 3 లక్షల మంది ర్యాలీ చేశారని అంచనా వేసినప్పటికీ.. దాదాపు 8 లక్షల మంది పాలస్తీనాకు మద్దతుగా ఈ ర్యాలీలో పాల్గొన్నారని అందులో పాల్గొన్న నిరసనకారులు తెలిపారు. Also Read: 14 గంటల్లో 800 సార్లు భూకంపం.. ఆ దేశంలో ఆగమాగం రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఉక్రెయిన్‌కు మద్దతు ఇచ్చిన పాలకులు.. పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో మాత్రం.. పాలస్తీనాకు మద్దతు ఇవ్వడం లేదంటూ ఈ నిరసనల్లో పాల్గొన్న ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది దేశ నాయకులు తమవైపు ఉన్నప్పటికీ.. వారు మాట్లాడటానికి భయపడుతున్నారని తెలిపారు. మరోవైపు పాలస్తీనాకు మద్దతుగా ర్యాలీ జరగడంతో.. మళ్లీ దీనికి కౌంటర్‌గా ఎవరూ కూడా నిరసనలు చేయకుండా ఆపేందుకు తాము అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. Also Read: ఖతార్ లో నేవీ అధికారులకు మరణశిక్ష.. అప్పీల్ చేసిన భారత్! #telugu-news #israel-hamas-war #israel-hamas మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి