Aarogya Sri: తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. ‘ఆరోగ్య శ్రీ‘లో మరిన్ని సేవలు!

ఆరోగ్య శ్రీ ద్వారా పేద ప్రజలు మరిన్ని పరీక్షలు చేయించుకునేలా తెలంగాణ సర్కార్ ప్రణాళిక సిద్ధం చేసింది. గుండె సమస్యల నిర్ధారణకు నిర్వహించే యాంజియోగ్రామ్, అలాగే పార్కిన్ సన్, వెన్నుముక వంటి ఖరీదైన వ్యాధులను కూడా ఆరోగ్య శ్రీలో చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

New Update
Aarogya Sri: తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. ‘ఆరోగ్య శ్రీ‘లో మరిన్ని సేవలు!

TELANGNA: తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. గుండె సమస్యల నిర్ధారణకు నిర్వహించే యాంజియోగ్రామ్ పరీక్షలు ఇక నుంచి ఆరోగ్య శ్రీ ద్వారా చేయించుకునే వెసులు బాటు కల్పించింది. అలాగే పార్కిన్ సన్, వెన్నుముక వంటి ఖరీదైన వ్యాధులను కూడా ఆరోగ్య శ్రీలో చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటితోపాటు మరో 65 కొత్త చికిత్స విధానాలను అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరోగ్య శ్రీలో ఉన్న 1672 చికిత్స విధానాల్లో 1375 ప్రోసీజర్లకు ప్యాకేజీ ధరలు పెంచారు. ఇందుకు అదనంగా మరో వీటికి సంబంధించి రూ.497.29 కోట్లు అవసరం కాగా, ఈ నిధులను రిలీజ్ చేసినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ పథకం కింద 2.84 కోట్ల లబ్ధిదారులు ఉండగా, వీరికి ఈ స్కీమ్ ద్వారా రూ.10 లక్షల వరకు ఆర్ధిక సహాయం అందుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1402 ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందుతున్నాయి. దీనిపై తెలంగాణ ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు