Telangana: జూలై 1 నుంచే నెలకు రూ.2500.. మహిళలకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త! తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. ఇప్పటికే చాలా పథకాలను మొదలుపెట్టిన రేవంత్ సర్కార్ ఇప్పుడు తాజాగా మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. జూలై 1 నుంచి మహిళల ఖాతాలో ప్రతి నెలా రూ.2,500 జమ చేయనున్నట్లు సమాచారం. By Manogna alamuru 22 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Money In Women Accounts: గతేడాది అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. ఇప్పటికే కొన్ని అమలు చేస్తుండగా మరికొన్నింటినీ అమలు చేసేందుకు ఆఫీసర్లు విధివిధానాలపై కసరత్తు చేస్తున్నారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో మహిళలకు పెద్దఎత్తున ప్రాధాన్యత కల్పించారు. వీటిలో మహిళల ఖాతాలో ప్రతి నెలా రూ.2,500 జమ చేస్తామని ప్రకటించారు. విశ్వసనీయమైన సమాచారం మేరకు ఈ స్కీంను జూలై 1 నుంచి ప్రారంభించనున్నట్టు తెలిస్తోంది. అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ త్వరలో ఈ స్కీమ్ ప్రారంభిస్తామని ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. ఇప్పుడు తాజాగా మహిళలకు డబ్బులు పథకం అమలుకు సంబంధించి అధికారులు ఇప్పటికే మార్గదర్శకాలను సిద్ధం చేశారు. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళా అకౌంట్లో నెలనెలా రూ.2,500 జమ కానున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి పెన్షన్లు పొందని కుటుంబాల్లోని మహిళలకు మాత్రమే నగదు అందేలా నిబంధనలు తీసుకొస్తున్నట్టు సమాచారం. ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందాలనుకునే వారికి ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టింది. దరఖాస్తుదారు తెలంగాణ నివాసియై వుండాలి. తప్పనిసరిగా కుటుంబానికి స్త్రీ యాజమని అయి ఉండాలి. అలాగే బీపీఎల్ కుటుంబానికి చెందినవారై ఉండాలి. దరఖాస్తుదారు తప్పనిసరిగా వివాహం చేసుకోవాలి. ఒక కుటుంబం నుంచి ఒక మహిళ మాత్రమే పథకం ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. దరఖాస్తుదారు కుటుంబం సంవత్సరానికి రెండు లక్షల కంటే తక్కువ కుటుంబ ఆదాయం కలిగి ఉండాలి. ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటోంది. ఈ స్కీమ్‌పై సీఎం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవడమే మిగిలి ఉంది. సమాజంలో మహిళకు సాధికారత, ప్రోత్సాహం అందించడమే ‘మహాలక్ష్మి’ పథకం లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది. స్త్రీని శక్తిమంతం చేయడమే కాకుండా వారిని ఆర్థికంగా స్వతంత్రులను చేయడం ద్వారా వారి జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపింది. మహిళలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు, వారి జీవనశైలిని మెరుగుపరచుకోవడంతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని పొందడం, తద్వారా పేదరికాన్ని తగ్గించొచ్చనే ఆలోచనతో ఈ పథకాన్ని మొదలుపెడుతున్నామని ప్రభుత్వం చెబుతోంది. Also Read:Andhra Pradesh: ఆంధ్రాలో 18 మంది ఐ.ఏ.ఎస్ అధికారులు బదిలీ.. #money #government #women #telanagana #accounts మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి