Mohammed Shami: షమీ వచ్చేస్తున్నాడు.. క్లారిటీ ఇచ్చిన జైషా!

భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ఫ్యాన్స్‌కు జైషా గుడ్ న్యూస్ చెప్పారు. అనుభవజ్ఞుడైన షమీ ఆస్ట్రేలియా పర్యటనకు అందుబాటులోకి రాబోతున్నట్లు తెలిపారు. భారత జట్టుకు షమీ సేవలు చాలా అవసరముందని, అప్పటివరకు షమీ ఫిట్‌గా ఉంటాడని ఆశిస్తున్నట్లు జైషా చెప్పారు.

New Update
Mohammed Shami: షమీ వచ్చేస్తున్నాడు.. క్లారిటీ ఇచ్చిన జైషా!

Shami: 2023 వరల్డ్ కప్ టోర్నీలో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన భారత పేసర్‌ మహ్మద్‌ షమీ జట్టులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత గాయం కారణంగా ఆటకు దూరమైన షమీ.. ఆస్ట్రేలియా పర్యటనకు అందుబాటులోకి రాబోతున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపారు.

ఆస్ట్రేలియా పర్యటనకు వస్తాడు..
ఈ మేరకు భారత జట్టుకు షమీ సేవలు అవసరం చాలా ఉందని, బౌలింగ్‌లో అనుభవజ్ఞుడైన షమీ ఆస్ట్రేలియా పర్యటనకి వస్తాడని చెప్పారు. 'భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకి సిద్ధమవుతోంది. షమీ సేవలు జట్టు కోరుతోంది. అప్పటిలోగా షమీ ఫిట్‌గా ఉంటాడని ఆశిస్తున్నాం' అన్నారు. ఇక ఈ సీరస్‌లో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలనుకున్నామని, రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లీ ఫిట్‌గా ఉన్నట్లు తెలిపారు. అయితే ఆస్ట్రేలియా సిరీస్‌కు వెళ్లాలంటే షమీ రంజీ ట్రోఫీ ద్వారా ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాలని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడు స్నేహాశిష్ గంగూలీ తెలిపారు.

IND vs AUS టెస్ట్ సిరీస్ 2024 షెడ్యూల్:
- మొదటి టెస్ట్ నవంబర్ 22-26 పెర్త్ స్టేడియం
- రెండవ టెస్ట్ డిసెంబర్ 6-10 అడిలైడ్ ఓవల్
- మూడో టెస్టు డిసెంబర్ 14-18 గబ్బా, బ్రిస్బేన్
- నాల్గవ టెస్ట్ డిసెంబర్ 26-30 MCG, మెల్బోర్న్
- ఐదవ టెస్ట్ జనవరి 3-7 SCG, సిడ్నీ

Advertisment
Advertisment
తాజా కథనాలు