PM Modi : ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు.. ప్రసంగంలో ఈ అంశాలే టార్గెట్‌..

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ నెలలో దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, పలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ నెలలో 15 రోజులు ప్రధాని వీటిపైనే ఫోకస్‌ పెట్టనున్నారు.

New Update
PM Modi : ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు.. ప్రసంగంలో ఈ అంశాలే టార్గెట్‌..

PM Modi Tours : పార్లమెంటు ఎన్నికలు(Parliament Elections) సమీపిస్తున్న నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల బరిలో దిగేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ(PM Modi).. ఈ నెలలో దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయనున్నట్లు సమాచారం. ఆయా రాష్ట్రాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, పలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆ తర్వాత నిర్వహించే బహిరంగ సభల్లో ఈ పదేళ్లలో కేంద్రం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.

Also Read : శరద్‌పవార్ కు ఈసీ నోటీసులు

ఈ అంశాలే టార్గెట్

2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కూడా ప్రధాని ఇలానే దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. ఎన్నికల కోడ్‌(Election Code) వచ్చేలోగా ఎక్కువ రాష్ట్రాల్లో పర్యటించేందుకు వీలుగా ఈ నెలలో 15 రోజులు ప్రధాని వీటిపైనే ఫోకస్‌ పెట్టనున్నారు. ఈ వారంలో ఒడిశా, అస్సాంలల పర్యటించనున్నట్లు తెలుస్తోంది. మరోవిషయం ఏంటంటే.. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని తన ప్రసంగంలో అయోధ్య(Ayodhya) రామమందిర(Ram Mandir) ప్రారంభోత్సవం అంశం కంటే పదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించే ప్రజలకు తెలియజేయనున్నట్లు సమాచారం.

అది కూడా వాడుకుంటారు

తాజాగా పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ చేసిన ప్రసంగమే ఇందుకు నిదర్శమని పలువురు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రసంగం జరిగిన తర్వాత ప్రధాని గోవాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఆ రాష్ట్రంలో ఎక్కడా కూడా అయోధ్య రామమందిరం అంశం తీసుకురాలేదు. దీన్నిబట్టి ఆయన ముందు ప్రసంగాల్లో కూడా ఈ అంశం కంటే అభివృద్ధి పనులకే ప్రాధాన్యమిస్తారని చెబుతున్నారు. మరోవైపు అవసరమైనప్పుడు కచ్చితంగా ఈ అంశాన్ని ఎన్నికల ప్రచారంలో వాడుకుంటారని మరికొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read: పేపర్ లీక్ నిరోధక బిల్లుకు లోక్‌సభలో ఆమోదం

Advertisment
Advertisment
తాజా కథనాలు