LPG Gas : సామాన్యుడికి మోదీ సర్కార్ గుడ్ న్యూస్...గ్యాస్ ధరలపై కీలక నిర్ణయం..!!

త్వరలోనే ఎల్పీజీకి సంబంధించి భారీ ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్యాస్ ధరలు తగ్గించి పేద, మధ్య తరగతి వర్గాలను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

New Update
LPG Gas : సామాన్యుడికి మోదీ సర్కార్ గుడ్ న్యూస్...గ్యాస్ ధరలపై కీలక నిర్ణయం..!!

LPG Gas:  ఈరోజుల్లో గ్యాస్ సిలిండర్ లేని ఇల్లు లేదు. దేశంలోని ప్రతి ఇంట్లో ఎల్పీజీ (LPG Gas )స్టవ్ ఉంటుంది. అయితే గ్యాస్ ఏజెన్సీల సమన్వయంతో గ్యాస్ వినియోగదారులకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తున్న విషయం తెలిసిందే. నగరాన్ని బట్టి గ్యాస్ ధరల్లో మార్పులు ఉంటాయి. గతరెండు మూడేళ్లుగా గ్యాస్ ధరలు బాగా పెరగడంతో సామాన్యుడికి మరింత భారం పడినట్లయింది. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాలు పలు రాజకీయ పార్టీలు ఇదే అంశాన్ని కీలకంగా తీసుకుంటున్నాయి. గ్యాస్ సిలిండర్ (Gas Cylinders) ధరల నియంత్రణపై అటు కేంద్రంతో పాటు ఇటు పలు రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పేద ప్రజలకు తక్కువ ధరలకే సిలిండర్ అందించే ప్రకటనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోకసభ ఎన్నికలను పరిగణలోనికి తీసుకుని సామాన్యుడికి మేలు జరిగే విధంగా గ్యాస్ ధరలపై మోదీ సర్కార్ (PM Modi Govt) ఫోకస్ పెట్టినట్లు సమాచారం.

త్వరలోనే ఎల్పీజీకి సంబంధించి భారీ ప్రకటన కూడా వెలువడవచ్చని సమాచారం. గ్యాస్ ధరలు తగ్గించి పేద, మధ్య తరగతి వర్గాలను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అర్హులైన పేద కుటుంబాలకు తక్కువ ధరకే ఎల్ పీజీ సిలిండర్లను (LPG Gas Cylinder) అందించాలని మోదీ సర్కార్ ప్లాన్ చేస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గతేడాది అగస్టు నెలలో కూడా మోదీ సర్కార్ ఇంట్లో ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరను 200 రూపాయలు తగ్గించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (Ujjwala Yojana) లబ్దిదారులకు 400 రూపాయల సబ్సిడి అందుతోంది.

ఇది కూడా చదవండి  : నిరుద్యోగులకు శుభవార్త. త్వరలోనే భారీగా ఆర్మీ ఉద్యోగాలకు నోటిఫికేషన్..పూర్తివివరాలివే..!!

ఈ నేపథ్యంలో పేద కుటుంబాలకు సబ్సిడీ మొత్తాన్ని మరింత పెంచే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సబ్సిడీ రూ. 300 వరకు ఉండవచ్చని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువరించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం దేశంలో ఎల్పీజీ వినియోగదారుల సంఖ్య దాదాపు 33కోట్లు ఉండగా..గతేడాది 2025-26 నాటికి మరో 75 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు యాడ్ అవుతాయని అంచనా. కాగా సబ్సిడీతో అందించే సిలిండర్లపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తుంది. ఈ మేరకు రాయితీ విషయంల మార్పులు తీసుకువస్తుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు