Relationship: కపుల్స్‌ విడిపోవడానికి పెద్ద కారణం ఇదే? మీరు ఈ మిస్టెక్‌ చేయవద్దు!

కపుల్స్‌ విడిపోవడానికి అతి పెద్ద కారణం అధిక మొబైల్ వాడకమేనని పరిశోధనలు చెబుతున్నాయి. పక్కన ఉన్న లవర్‌ను పట్టించుకోకుండా చేతిలోని మొబైల్‌తో వేరే ఎవరితోనో ఛాట్‌ చేయడం వల్ల గొడవలు వస్తాయి. ఇదే అపార్థాలకు కారణం అవుతుంది.

New Update
Relationship: కపుల్స్‌ విడిపోవడానికి పెద్ద కారణం ఇదే? మీరు ఈ మిస్టెక్‌ చేయవద్దు!

చుట్టూ మనుషులు ఉన్నా వారితో మాట్లాడకుండా ఫోన్‌(Phones)లు చూసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇంట్రోవర్ట్‌ అని ఏదో ఫోజ్‌ కొడుతూ కొందరు ఇలా చేస్తుండడం మరో విడ్డూరం. నిజానికి నలుగురితో మాట్లాడలేకపోవడం ఓ లోపం. ఇటు ఫోన్‌కు అడిక్ట్ అవడం మరో రోగం. ఈ రెండు జత కలిస్తే కాపురాలే కూలిపోతాయ్‌. భార్యభర్తలు కలిసి ఉండాలంటే కమ్యూనికేషన్‌ ముఖ్యం. ఇటీవలి కాలంలో ఫోన్‌ను పట్టుకుని వేలాడుతున్న జంటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకరినొకరు మాట్లాడుకోకుండా ఇద్దరూ ఎవరి ఫోన్‌లలో వారు బిజీ ఐపోతున్నారు. సాంకేతికతను దుర్వినియోగం చేయవద్దు. అతిగా ఈ గ్యాడ్జెట్‌ను ఉపయోగించవద్దు. చాలా మంది మొబైల్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇస్తూ తమ ప్రియమైన వారిని దూరం చేసుకుంటున్నారని ఇటీవలి విడిపోతున్న లవర్స్‌ లేదా భార్యభర్తలను అడిగితే చెబుతారు.

publive-image ప్రతీకాత్మక చిత్రం (PC: UNSPLASH)

మొబైలే పెద్ద విలన్‌:
స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా లాంటి వ్యసనాలకు చాలా మంది బలైపోతున్నారు. ఒక జంట కలిసి కూర్చుని మాట్లాడడం మానేసి ఫోన్‌లో ఎవరితోనూ ఛాటింగ్‌లతోనో, సోషల్‌మీడియాలోనో మునిగి తేలుతున్నారు. ఒకరిని ఒకరు పట్టించుకోకపోతే మళ్లీ వాదనలు, అపార్థాలు, గొడవలు మొదలవుతాయి. అప్పుడు జంటల మధ్య పరస్పర ప్రేమ ముగుస్తుంది. ఫోన్ కారణంగా ప్రజలు తమ జీవిత భాగస్వామిని, పిల్లలను, స్నేహితులను నిర్లక్ష్యం చేయడం ప్రారంభిస్తున్నారు. ఎవరైనా మాట్లాడుతున్నప్పటికీ, ఏదైనా మాట్లాడుతున్నప్పటికీ, ప్రజలు అతనిని పట్టించుకోకుండా వారి మొబైల్‌ను స్క్రోల్ చేస్తూనే ఉంటారు.

ఇలా చేయవద్దు:
'కంప్యూటర్స్ ఇన్ హ్యూమన్ బిహేవియర్ జర్నల్'లో ప్రచురించిన పరిశోధన ప్రకారం ఎక్కువ మంది కపుల్స్‌ విడిపోవడానికి పెద్ద కారణం ఫోనేనని తేలింది. 48 శాతం మంది ఇదే విషయాన్ని చెప్పారు. ఫోన్‌లు తమ రిలేషన్‌షిప్‌లో చీలికకు కారణమవుతాయని బాధ పడ్డారు. ఫోన్‌ అధిక యూసేజ్‌ వల్లే గొడవలు అవుతున్నాయని 36 శాతం మంది చెప్పారు. ఇంట్లో ఎవరైనా లేదా మీ జీవిత భాగస్వామి మీతో ఎక్కువ మాట్లాడకుండా ఫోన్‌ పట్టుకునే ఉంటుంటే అలా చేయవద్దని ముందు స్లోగా చెప్పాలి. అంతేకానీ అరవకూడదు. వాళ్లు ఏం చెబుతున్నారో వినండి. కోపంగా లేదా వాదించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఫోన్ పెట్టమని వారిని కూల్‌గా అడగండి. పని వెలుపల మొబైల్‌ను ఎక్కువగా ఉపయోగించవద్దు. ఇంట్లోని ఇతర సభ్యులను కూడా అలా ఉండమని ఒప్పించండి.

Also Read: స్థిరంగా బంగారం, వెండి ధరలు

Advertisment
Advertisment
తాజా కథనాలు