Telangana:ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్.. BRS కు షాక్.. రెండూ కాంగ్రెస్ ఖాతాలోకే! తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్‌ను ఈసీ విడుదల చేసింది. ఈరోజు నుంచి ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 29న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు రిజల్ట్ కూడా ప్రకటించనున్నారు. By Manogna alamuru 11 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MLC By-Elections:తెలంగాణ శాసనమండలి ఉపఎన్నికల్లో వేర్వేరు బ్యాలెట్ పత్రాలతో పోలింగ్ నిర్వహిస్తామని చెబుతోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ విధానం కొత్తేమీ కాదని...ఎప్పటినుంచో అమలు చేస్తున్నామని స్పష్టం చేసింది. కొన్నేళ్లుగా శాసనమండళ్లు ఉన్న రాష్ట్రాల్లో అమలు చేస్తున్నామని చెబుతోంది. సాధారణంగా మండలి ఎన్నికల్లో ఒకే బ్యాలెట్ పత్రంలో అభ్యర్థులను నమోదు చేస్తారు. తరువాత వచ్చే ఓట్ల ఆధారంగా గెలుపు ఎవరిదో ప్రకటిస్తారు. ప్రస్తుతం తెలంగాణలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఎమ్మెల్యేల కోటాలోనివి. ఈసారి రెండు ఉపఎన్నికలకు రెండు బ్యాలెట్ పత్రాలను వినియోగించనున్నారు. అంటే ఒక్కో ఎమ్మెల్యే తమ ప్రాథమ్యాలను రెండు బ్యాలెట్లలో నమోదు చేయాల్సి ఉంటుంది. Also read:ఏపీలో చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్… ఈరోజు అకౌంట్లలో 10 వేలు జమ ఉప ఎన్నికల షెడ్యూల్.. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు నోటిషికేషన్‌ను ఈసీ విడుదల చేసింది. దీని ప్రకారం ఇవాల్టి నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఈనెల 18 వరకు అభ్యర్ధులు నామినేషన్లు చేసుకోవచ్చును. మర్నాడు అంటే 19వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. అక్కడి నుంచి మరో మూడు రోజులలోపు అంటే జనవరి 22లోపు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చని చెబుతోంది కేంద్ర ఎన్నికల సంఘం. 22 తరువాత మాత్రం ఈ అవకాశం ఉందడు. తరువాత జనవరి 29న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. ఇక అదే రోజు పోలింగ్ అయిపోయిన వెంటనే ఓట్లను లెక్కించి ఫలితాలను కూడా వెల్లడిస్తారు. రెండు ఎమ్మెల్సీ పదవులకు ఎన్నిక ఇదే మొదటిసారి... మామూలుగా ఎమ్మెల్సీ పదవీ కాలం ఆరేళ్ళు ఉంటుంది. మధ్యలో ఏదైనా స్థానం ఖాళీ అయితే ఉపఎన్నిక నిర్వహిస్తారు. ఇలా చాలా సార్లు జరిగింది. అయితే ఈసారి రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ పదవులు ఒకేసారి ఖాళీ అయ్యాయి. శాసనమండలి సభ్యులుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో ఇద్దరూ డిసెంబరు 9న తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. వారి పదవీకాలం 2027 నవంబరు 30 వరకు ఉంది. కానీ వారు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో వీటికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఈ రెండు ఎమ్మెల్సీ పదవులకే ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు. రెండూ కాంగ్రెస్ ఖాతాలోకే అయితే ఈసారి రెండు వేరు వేరు బ్యాలెట్ పత్రాలను వినియోగించి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం వలన లెక్కలు మారాయి. వేర్వేరు బ్యాలెట్ల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే..ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఆధారంగా ఆ స్థానాలు కాంగ్రెస్‌కు దక్కే అవకాశం ఉంది. ఇది బీఆర్ఎస్‌కు పెద్ద దెబ్బే అవుతుంది.అందుకే దీని మీద ఆ పార్టీ నేతలు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. దీన్నిరాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. కానీ ఒకట ఇకంటే ఎక్కువ స్థానాలకు ఉపెన్నికలు నిర్వహిస్తే రెండు వేరు వేరు బ్యాలెట్ పత్రాలు తప్పనిసరి అని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. #brs #congress #ec #mlc #telanagna #by-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి