Kids Tips: పిల్లలకు దగ్గు సిరప్‌ ఇచ్చేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి..చాలా ప్రమాదం

పిల్లలకు దగ్గు సిరప్ ఇస్తున్నట్లయితే దగ్గు సిరప్ ముందు D అనే పదం లేకుండా ఉండేవి చూసుకోవాలని వైద్యులు అంటున్నారు. ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు ఇది ఇవ్వకూడదని అంటున్నారు. దీని వల్ల పిల్లలు సులభంగా శ్వాస తీసుకుంటారు.

New Update
Kids Tips: పిల్లలకు దగ్గు సిరప్‌ ఇచ్చేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి..చాలా ప్రమాదం

Kids Tips: సీజన్లు మారుతుంటే పిల్లల్లో జలుబు, దగ్గు సమస్యలు సర్వ సాధారణం. పిల్లలకు దగ్గు వస్తే ఏమాత్రం సంకోచించకుండా దగ్గు సిరప్‌లు ఇస్తుంటాం. అది పిల్లలకు మంచిదా కాదా అనేది మాత్రం అస్సలు చూసుకోం. కనీసం వైద్యుని సలహా కూడా తీసుకోం. ప్రతీ తల్లిదండ్రులు తమ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని చూస్తారు. అయితే పిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు మాత్రం చేసే చిన్న చిన్న పొరపాట్లు మరింత అనారోగ్యానికి గురిచేస్తాయి. జలుబు విషయంలో గొంతు వెనుక భాగంలో శ్లేష్మం ప్రవహించడం వల్ల దగ్గు వస్తుంది. పిల్లవాడు పాలు తాగుతూ ఊపిరి సరిగా పీల్చుకుంటూ ఉంటే కంగారు పడాల్సిన పనిలేదు. కానీ దగ్గు ఎక్కువైతే డాక్టర్‌ని సంప్రదించకుండా దగ్గు సిరప్‌ ఇస్తుంటారు. దీని వల్ల కొన్నిసార్లు దగ్గు తగ్గుతుంది కానీ కొన్నిసార్లు ఎంత మందు వేసినా దగ్గు తగ్గదు.

ఈ విషయాలు గుర్తుంచుకోండి:

  • పిల్లలకు దగ్గు సిరప్ ఇస్తున్నట్లయితే దగ్గు సిరప్ ముందు D అనే పదం లేకుండా ఉండేవి చూసుకోవాలని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే డీ అంటే డెక్స్ట్రోమెథార్ఫాన్ అని వైద్యులు చెబుతున్నారు. ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు ఇది ఇవ్వకూడదని అంటున్నారు.

కఫం ఛాతీలోకి ప్రవేశించవచ్చు:

  • కొన్నిసార్లు పిల్లలకు దగ్గు లేకపోయినా కఫం పేరుకుపోతుంది. దగ్గు మందులు వాడటం వల్ల ప్రయోజనం ఉండదు. కఫం లోపలికి వెళ్లి న్యుమోనియాకు దారి తీస్తుందని వైద్యులు అంటున్నారు.

వైద్యుల సలహా:

  • డాక్టర్లు చెబుతున్నదాని ప్రకారం.. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు టెర్బుటాలిన్ లేదా లెవోసల్బుటామాల్ కలయికతో దగ్గు సిరప్ ఇవ్వవచ్చు. ఇది బ్రోంకోడైలేటర్. ఇది పిల్లల శ్వాసకోశాన్ని విస్తరిస్తుంది. దీని వల్ల పిల్లలు సులభంగా శ్వాస తీసుకుంటారు. ఇది మ్యూకోలైటిక్ అయిన అంబ్రోక్సోల్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది పిల్లల లోపల పేరుకుపోయిన కఫాన్ని కరిగించి మలం ద్వారా బయటకు పంపుతుందని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి:  కొత్త పెళ్లి కూతుర్లూ.. ఇది మీ కోసమే.. అత్తమామలను ఫ్లాట్‌ చేసే చిట్కాలు!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు