Free Current: ఫ్రీ కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్.. ఈరోజు నుంచే?

రెండు గ్యారెంటీలను అమలు చేసిన కాంగ్రెస్.. మరో రెండు గ్యారెంటీలపై కసరత్తు చేస్తుంది. తాజాగా ఆర్టీవీతో మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. ఈరోజు ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రూ.500లకే సిలిండర్, రూ.200యూనిట్ల కరెంట్ ఫ్రీ హామీల అమలును ప్రకటించే అవకాశం ఉందని అన్నారు.

New Update
Free Current: ఫ్రీ కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్.. ఈరోజు నుంచే?

Minister Seethakka: ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  ఆరు గ్యారెంటీలతో (Congress Six Guarantees) అధికారంలోకి వచ్చన కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రెండు గ్యారెంటీలైన మహిళలకు ఉచిత బస్సు (Free Bus) ప్రయాణం, ఆరోగ్య శ్రీ కార్డు (Arogya Sri) పరిమితి పెంచింది. ఇదిలా ఉండగా మరో రెండు గ్యారెంటీలను అమల్లోకి తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. మరో రెండు గ్యారెంటీలు ఎప్పుడు అమల్లోకి వస్తాయనే దానిపై క్లారిటీ ఇచ్చారు.

ALSO READ: ఏపీకి ప్రత్యేక హోదా.. ఢిల్లీలో వైఎస్ షర్మిల దీక్ష

ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి సీతక్క (Minister Seethakka) మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ. వారం రోజులుగా ఇంద్రవెల్లిలోనే ఉండి సభను విజయవంతం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని అన్నారు. అమరవీరుల పోరాట స్ఫూర్తితో సీఎం మొదటి అడుగు ఇంద్రవెల్లి నుంచే వేయనున్నారని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారని పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎంచుకోవడం అభినందనీయం అన్నారు. ఇవాళ సోనియాగాంధీ ఉపాధి హామీ చట్టం అమలైన రోజు అని గుర్తు చేశారు.

ఇంద్రవెల్లి కాంగ్రెస్ పునర్నిర్మాణ సభ (Indravelli Meeting) గొప్పగా జరగబోతోందని అన్నారు. సభకు లక్షమంది తరలివస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో 13 నుంచి 14 ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నిస్తున్నాం అని అన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం అని పేర్కొన్నారు. ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు. అయితే.. 6గ్యారంటీలకు సంబంధించి కీలక ప్రకటన ఈరోజు వచ్చే అవకాశం ఉందని అన్నారు. రూ.500లకే సిలిండర్ (Gas Cylinder For Rs.500), రూ.200యూనిట్ల కరెంట్ ఫ్రీ హామీల (Free Current) అమలును ఇంద్రవెల్లి వేదికగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇంద్రవెల్లి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసే ప్రకటనపై ఉత్కంఠ కొనసాగుతోంది.

ALSO READ: స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ

 

Advertisment
Advertisment
తాజా కథనాలు