Microsoft Outage: మైక్రోసాఫ్ట్‌ సేవలకు అంతరాయం.. స్పందించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దీనిపై పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా విమానశ్రయాల్లో అదనపు సీట్లు, మంచినీటి వసతి, ఆహారం సమకూర్చాలని ఎయిర్‌పోర్టు అధికారులు, ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించామని తెలిపారు.

New Update
Microsoft Outage: మైక్రోసాఫ్ట్‌ సేవలకు అంతరాయం.. స్పందించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో (Microsoft outage) సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు, ఎయిర్‌పోర్ట్‌లలో అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం.. మైక్రోసాప్ట్‌తో నిరంతరం టచ్‌లో ఉందని తెలిపారు. ఈ సాంకేతిక సమస్యకు గల కారణాలను గుర్తించినట్లు ఆయన ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. వీటి పరిష్కారానికి అప్‌డేట్‌లు విడుదలయ్యాయని పేర్కొన్నారు. మరోవైపు ఈ అంతరాయంతో దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్ట్‌లలో విమాన సేవల్లో జాప్యం జరుగుతోందని పౌరవిమానయానశాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా విమానశ్రయాల్లో అదనపు సీట్లు, మంచినీటి వసతి, ఆహారం సమకూర్చాలని ఎయిర్‌పోర్టు అధికారులు, ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించినట్లు పేర్కొన్నారు.

Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇన్ఫోసిస్‌లో 20 వేల ఉద్యోగాలు!

ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అర్థం చేసుకున్నామని.. వీలైనంత త్వరగా వారు గమ్యస్థానాలకు చేరుకునేలా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. మ్యాన్యువల్ బ్యాకప్ సిస్టమ్స్‌ ద్వారా పరిస్థితిని కొంతవరకు చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇదిలాఉండగా ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం ఏర్పడటంతో పలు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో విండోస్ 11, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. బ్లూ స్క్రీన్ ఎర్రర్ రావడంతో పలు సేవలు నిలిచిపోయాయి. భారత్‌తో పాటు అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఈ సమస్య తలెత్తింది.

Also read: మనుషుల ఆయుష్షు పెంచే ప్రయోగం సక్సెస్‌..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tirumala High Alert :  పహల్గాంలో ఉగ్రదాడి..తిరుమలలో హై అలర్ట్

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో దేశమంతా హై అలర్ట్‌ ప్రకటించారు. దేశవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. దాడుల నేపథ్యంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమతిలోనూ హై అలర్ట్‌ ప్రకటించారు.

New Update
Tirumala High Alert

Tirumala High Alert

Tirumala High Alert :  జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో దేశమంతా హై అలర్ట్‌ ప్రకటించారు. దేశవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. దాడుల నేపథ్యంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమతిలోనూ హై అలర్ట్‌ ప్రకటించారు. కొండపై భద్రతను విజిలెన్స్ సిబ్బంది కట్టుదిట్టం చేశారు. కశ్మీర్‌లోని పహల్గాం దాడి నేపథ్యంలో తిరుమలలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Also Read: BIG BREAKING: మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్!
కొండపై సెక్యూరిటీ కట్టుదిట్టం చేసినట్లు  టీటీడీ వెల్లడించింది. తిరుమల ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డు సమీపంలో వాహనాలను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే అన్ని వాహనాలను, భక్తులను క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. మొదట అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్డులో పలుచోట్ల ఆర్టీసీ బస్సులను ఇతర ప్రైవేటు వాహనాలను, అందులోని లగేజీని సైతం వదలకుండా తనిఖీ చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ చెబుతోంది. శ్రీవారి ఆలయ పరిసరాలలోనూ భద్రతను నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. నిఘవర్గాల హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం తిరుమలలో కూడా భద్రత కట్టుదిట్టం చేసింది.

 

 


 Also Read:TG Crime: కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కొడుకునే లేపేసిన పిన్ని!

తిరుమలకు అలిపిరి మీదుగా వాహనాలతో పాటుగా కాలినడకన వచ్చే రెండు మార్గాలు ఉన్నాయి. అలాగే శ్రీవారి మెట్టు నడకమార్గం ఉంది. తిరుమలకు వాహనాల్లో వెళ్లే భక్తుల లగేజీని అలిపిరి సప్తగిరి చెకింగ్ పాయింట్ దగ్గర తనిఖీలు చేస్తారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గంలో వెళ్లే భక్తుల లగేజీని కూడా చెక్ చేసిన తర్వాతే అనుమతిస్తారు. ప్రస్తుతం తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉండటం, కాశ్మీర్ ఉగ్రదాడితో తిరుమలలో కూడా హై అలర్ట్ ప్రకటించారు.. దేశంలో మరోసారి ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో తిరుమలలో భద్రతలను కట్టుదిట్టం చేశామన టీటీడీ వర్గాలు స్పష్టం చేశాయి.

ఇది కూడా చదవండి: ఈ పండ్లు తింటే క్యాన్సర్‌ పరార్.. ఆ అద్భుతమైన ఆహారాలు ఇవే
 
మరోవైపు ఆక్టోపస్‌ దళం కూడా అప్రమత్తమైంది. ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి.. భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆక్టోపస్ దళాలు రాష్ట్రంలోని వివిధ ప్రముఖ స్థలాలు, ఆలయాలు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఏటా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఆక్టోపస్ టీమ్ తిరుమల శ్రీవారి ఆలయంలో మాక్ డ్రిల్ చేసింది. ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా, భ‌ద్రతా, సివిల్ పోలీసులకు, రిజర్వు పోలీసులకు, ఆలయ సిబ్బందికి, వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరిస్తారు. గతేడాది మార్చిలో తిరుమలలో మాక్ డ్రిల్ నిర్వహించారు. అలాగే తిరుమల ఆలయం దగ్గర కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.. 24 గంటలు సాయుధ బలగాల పహారాలో కట్టుదిట్టమైన నిఘా ఉంటుంది. మొత్తం మీద కాశ్మీర్ ఉగ్రదాడి ప్రభావం తిరుమలపై కూడా కనిపించింది.. ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యల్లో భాగంగా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.

Also Read: Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ మృతి.. హర్ష కుమార్ కు సోనియా గాంధీ సంచలన లేఖ!

Advertisment
Advertisment
Advertisment