Konda Surekha: 'లిక్కర్ రాణి'.. కవితపై మంత్రి కొండా సురేఖ ఫైర్

లిక్కర్ స్కాంలో ఇరికి ప్రజల సొమ్మును దొచుకోలేదా? అని కవితను ప్రశ్నించారు మంత్రి కొండా సురేఖ. లిక్కర్ రాణిగా కవిత పేరు పొందారని.. బీజేపీ కాళ్ళు మొక్కి ఈ కేసు నుంచి తప్పించుకున్నారని ఎద్దేవా చేశారు. ఎంపీ ఎన్నికల్లో కవిత ఎక్కడ పోటీ చేసిన ఓడిపోతుందని అన్నారు.

New Update
Konda Surekha: 'లిక్కర్ రాణి'.. కవితపై మంత్రి కొండా సురేఖ ఫైర్

Minister Konda Surekha: బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ ఘాటుగా స్పందించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కవిత ఎక్కడ నుంచి ఎంపీగా పోటీ చేసిన చిత్తుగా తెలంగాణ ప్రజలు ఓడిస్తారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రభుత్వం అని అన్నారు. కాంగ్రెస్ అంటేనే రైతుల పార్టీకి అని పేర్కొన్నారు.

ALSO READ: కేసీఆర్ లేకుంటే రేవంత్ సీఎం అయ్యేవాడా?.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

మీ అన్న కొడుక్కి హోదా ఏంటి?..

భద్రాద్రి సీతారాములకు కేసిఆర్ మనవడు ఏ హోదాలో పట్టు వస్త్రాలు తీసుకెళ్ళాడు? అని ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు మంత్రి కొండా సురేఖ. ఆ సొమ్ము కేసిఆర్ సొంత డబ్బులేనా? అని అడిగారు. అమెరికాలో గిన్నెలు కడిగే మీకు వందల కోట్లు పెట్టి సొంత విమానాలు కొనుక్కునే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది?.. తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకుతిన్నారని ఆరోపించారు. ప్రజాసొమ్ము దుర్వినియోగం గురించి మాట్లాడే అర్హత కవితకు లేదని అన్నారు.

లిక్కర్ రాణిగా..

లిక్కర్ స్కాంలో ఇరికి ప్రజల సొమ్మును దొచుకోలేదా? అని కవితను ప్రశ్నించారు మంత్రి కొండా సురేఖ. లిక్కర్ రాణిగా కవిత పేరు పొందారని పేర్కొన్నారు. బీజేపీ కాళ్ళు మొక్కి కవిత ఈ లిక్కర్ స్కాం కేసు నుంచి తప్పించుకున్నారని ఆరోపించారు. కవిత ఎక్కడి నుండి ఎంపీ గా పోటీ చేసినా ప్రజలు ఓడగొట్టి ఇంటికి పంపుతారని జోస్యం చెప్పారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు కవిత వ్యాఖ్యలు ఉన్నాయని చురకలు అంటించారు.

మేము తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉంటాం, బీఆర్ఎస్ నేతలకు కాదు అని అన్నారు. ఇలాంటి చీప్ విమర్శలు మానుకోండి అని కవితతో పాటు బీఆర్ఎస్ నేతలకు సలహా ఇచ్చారు. ఎమ్మెల్సీ కవిత పూలే గారి గురించి మాట్లాడడం హాస్యాస్పదం అని అన్నారు మంత్రి సురేఖ. పదేళ్లు పరిపాలించినప్పుడు పూలే గారు గుర్తుకు రాలేదా..? అని ప్రశ్నించారు.

DO WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు