/rtv/media/media_files/2025/04/26/K1CLLc7akC19DaDvl1e4.jpg)
SAJJALA SREEDHAR REDDY
AP liquor scam : వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం కేసులో వరుస అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. ఇటీవలె కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు తాజాగా ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ఎండీ సజ్జల శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో శ్రీధర్ రెడ్డి ఏ6గా ఉన్నారు. ఆయనను కాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నారు. లిక్కర్ స్కామ్‌లో సూత్రధారి రాజ్ కసిరెడ్డి కాగా.. కమీషన్లు చెల్లించేలా కంపెనీలను బెదిరించడం, ఒత్తిడి చేయడంలో సజ్జల శ్రీధర్ రెడ్డి కీలకంగా వ్యహించినట్లుగా సీట్ గుర్తించింది. ఇదే కేసులో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి (ఏ1), ఆయన తోడల్లుడు చాణక్య (ఏ8)ను అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
Also Read: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?'
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక కొత్త మద్యం పాలసీని అడ్డు పెట్టుకుని ప్రతినెలా రూ.60 కోట్ల మేర ముడుపులు సేకరించాలనే విషయంలో ఎంపీ మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, నాటి ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్ స్పెషల్ ఆఫీసర్ సత్య ప్రసాద్‌తో కలిసి శ్రీధర్‌రెడ్డి కూడా కుట్రలు చేసినట్లుగా విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే కేసులో శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Also Read: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన
శ్రీధర్ రెడ్డి వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి వ్యాపారంలో వాటా ఇచ్చి, వేల కోట్ల మద్యం వ్యాపారం చేసి వందల కోట్లు వెనకేసుకున్నట్లు సిట్ అధికారులు సమాచారం సేకరించారు. కొన్నాళ్లుగా ఆయన కదలికలపై దృష్టి సారించారు. ఎట్టకేలకు... శుక్రవారం సాయంత్రం శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసి. విజయవాడకు తీసుకొచ్చారు. శనివారం ఆయనను ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతారు.
Also Read: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?
మద్యం కుంభకోణంలో సజ్జల శ్రీధర్‌రెడ్డి పాత్ర గురించి చాణక్య రిమాండ్ రిపోర్టులోనే ‘సిట్’ క్లుప్తంగా వివరించింది. దీని ప్రకారం... 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలో ఒక భేటీ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని మద్యం డిస్టిలరీస్ యజమానులను రప్పించారు. లిక్కర్ సరఫరా చేయాలంటే కనీసం 12శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు.
Also Read: New Smartphone: శాంసంగ్ M56 5G ఫస్ట్ సేల్ షురూ.. భారీ డిస్కౌంట్- ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!
హైదరాబాద్‌లోని స్టార్ హోటళ్లలో సజ్జల శ్రీధర్ రెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారి సత్య ప్రసాద్ పలుమార్లు చర్చలు జరిపారు. కమీషన్లు ఇచ్చే కంపెనీలకే ఆర్డర్లు వెళ్లాయి. అలాగే అప్పటికే ఏపీలో ఉన్న డిస్టిలరీస్‌ను బలవంతంగా లాక్కుని సొంతంగా మద్యం తయారు చేయడం మొదలుపెట్టారు. శ్రీధర్‌రెడ్డి ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీ్‌లో మిథున్‌రెడ్డికి వాటా వచ్చేలా ప్లాన్ చేశారు. వైసీపీ హయాంలో మద్యం దుకాణాల్లో పుష్కలంగా అందుబాటులో ఉన్న సదరన్ బ్లూ, నైన్ హార్స్ వంటివి వీరి ఉత్పత్తులే కావడం గమనార్హం.
Also Read : మాకు నీళ్లు ఆపితే మీ శ్వాస ఆపుతాం...మోదీకి హఫీజ్ వార్నింగ్!
Telangana Elections: కాంగ్రెస్‌లో 10 మంది సీఎంలు ఉన్నారు, జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా కూడా గెలవడు : హరీష్‌రావు
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్యమంత్రి అవుతా అంటున్నారని కానీ ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవరని మంత్రి హరీష్ రావు అన్నారు. జానారెడ్డి పోటీ చేయకున్న సీఎం అవుతా అంటున్నారని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో 10 మంది సీఎంలు ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.
మరో వారం రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార, విపక్ష నేతలు హోరాహోరీగా ప్రచారాలు చేస్తూ ప్రజలకు వరాల జల్లులు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి ముస్లీం మైనారిటీల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా సంగారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్‌ను ఆశీర్వదించడానికి వచ్చిన ముస్లీం సోదరులకు ధన్యవాదాలు చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ రెసిడెన్షియల్ సూళ్లను ఏర్పాటు చేసిందని.. అలాగే షాదీ ముబారక్ పథకాన్ని కూడా అమలు చేస్తోందని అన్నారు. సదాశివపేటలో కబరిస్తాన్ కోసం 5 ఎకరాల వరకు ఇచ్చామని తెలిపారు. అలాగే మైనార్టీ విద్యార్థులకు పోషకాహారం అందిస్తున్నామని.. 17 వేల మంది ఇమామ్‌లకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం కూడా ఇస్తున్నామని పేర్కొన్నారు.
Also read: రైతుల చుట్టే తెలంగాణ ఎలక్షన్స్.. ఎవరికి పట్టం కట్టేనో మరి..!
గతంలో చింతా ప్రభాకర్ ఎన్నికల్లో ఓడినా కూడా ప్రజల మధ్యలోనే ఉన్నాడని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డిపై హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. జగ్గారెడ్డి ముఖ్యమంత్రి అవుతా అని అంటున్నారని.. కానీ ఆయన కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవరని హరీష్ రావు అన్నారు. ఇక జానారెడ్డి అయితే ఎమ్మెల్యేగా పోటీ చేయ్యట్లేదు కానీ.. సీఎం అవుతా అని అంటున్నారని.. ప్రస్తుతం కాంగ్రెస్‌లో పది మంది ముఖ్యమంత్రులు ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. అలాగే.. ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డికి మెడికల్ కాలేజ్,నర్సింగ్ కాలేజ్ ఇచ్చారని తెలిపారు. అలాగే రూ.2 కోట్లతో.. సంగారెడ్డి, సదాశివపేటలో మైనార్టీలకు షాదీఖానా నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
Also Read: బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ.. బీఎస్పీతోనే అన్ని వర్గాలకు న్యాయం: మాయావతి
AP liquor scam : ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో సంచలనం... సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్
వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం కేసులో వరుస అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Butta Renuka: వైసీపీకి భారీ షాక్... మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తుల వేలం
వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక ఎల్ఐసీ హౌసింగ్ సంస్థ నుంచి రూ.360 కోట్లు తీసుకొని చెల్లించలేదు. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
BIG BREAKING: పాక్ కి భారీ షాక్..10 మంది సైనికులు హతం!
భారత్‌తో యుద్ధం తప్పదన్నవేళ పాకిస్థాన్ కు పెద్ద షాక్ తగిలింది.శుక్రవారం పాక్ లోని క్వెట్టాలో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ జరిపిన దాడుల్లో 10 మంది పాక్ సైనికులు మృతి చెందారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ n
Stomach Worms: కడుపులో నులిపురుగులు పోవాలా.. లవంగంతో ఇలా చేయండి
కడుపులో నులి పురుగుల సమస్యలను నియంత్రించడానికి లవంగాలు చాలా సహాయపడతాయి. కడుపులో పురుగులు ఉన్నవారు ఉదయం రెండు లవంగాలను నమిలి వాటి రసాన్ని మింగితే ఈ సమస్యను వేగంగా పరిష్కరించవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Mascow-Trump:మాస్కోకు ట్రంప్ ప్రతినిధి!
ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే అంశం పై చర్చలు జరిపేందుకు ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మరోసారి మాస్కోకు పయనమయ్యారు.ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...
నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. Short News | general | Latest News In Telugu | నేషనల్
🔴Pahalgam Terrorist Attack Live Updates: కశ్మీర్ లో ఉగ్రవాదుల వేట.. లైవ్ అప్డేట్స్!
Brush: బ్రష్ చేసేప్పుడు ఎక్కువ పేస్ట్ వేసుకుంటే ఏమవుతుంది?
Pahalgam terror attack : పహల్గాం ఉగ్రదాడి ఘటనలో కీలక పరిణామం....అనుమానితుడి అరెస్ట్
BIG BREAKING: కశ్మీర్ సమస్యపై స్పందించిన ట్రంప్
AP liquor scam : ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో సంచలనం... సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్