Pakistan: పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం.. ఆకాశాన్ని తాకిన ధరలు ఆర్థిక సంక్షోభంతో పాకిస్థాన్ కొట్టుమిట్టాడుతోంది. ద్రవ్యోల్బణం పెరగడంతో నిత్యవసర ధరల వస్తువులు ఆకాశాన్ని తాకున్నాయి.రేట్లు ఆమాంత పెరుగుతుండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిలో పిండి రూ.800, లీటర్ పాలు రూ.210, బియ్యం రూ.200 నుంచి 400 వరకు పెరిగాయి. By B Aravind 07 May 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Pakistan Economic Crisis: ఆర్థిక సంక్షోభంతో పాకిస్థాన్ కొట్టుమిట్టాడుతోంది. ద్రవ్యోల్బణం (Inflation) పెరగడంతో.. నిత్యవసర ధరల వస్తువులు ఆకాశాన్ని తాకున్నాయి. రేట్లు ఆమాంత పెరుగుతుండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక కిలో పిండి కోనాలంటేనే రూ.800 చెల్లించాల్సి ఉందంటే.. పరిస్థితి ఏ స్థాయిలో దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన పాకిస్థాన్‌కు వాటి నుంచి బయటపడేందుకు నానా కష్టాలు ఎదుర్కొంటోంది. పాల ధర రూ.210 పాకిస్థాన్‌లోని కరాచిలో లీటర్ పాల ధర (Milk Price) రూ.210కి చేరుకుంది. ఇటీవల ఈ ధర రూ.200 ఉండగా.. పాడి రైతుల డిమాండ్ల మేరకు కరాచీ కమీషనర్ పాల ధరను లీటర్‌కు రూ.10 పెంపునకు ఆమోదం తెలిపారు. దీంతో ఇప్పుడు ప్రజలు లీటర్ పాలకు రూ.210 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంతేకాదు నగర ప్రజల సమస్యలు రోజురోజుకు దిగజారుతున్న నేపథ్యంలో.. పాల ధర రూ.50 పెరిగే అవకాశం ఉందని కరాచీ డెయిరీ ఫార్మర్స్ అధ్యక్షుడు ముబాషర్ ఖదీర్ అబ్బాసీ తెలిపారు. Also Read: మోదీ, మమతా బెనర్జీ, రేవంత్ యానిమేటెడ్ వీడియోలు వైరల్.. కిలో బియ్యం రూ.200 - 400 కరాచీలో కేవలం పాలు మాత్రమే కాదు. బియ్యం, పిండి, పప్పులు, అరటిపళ్లు, యాపిల్స్ ఇలా అన్ని ధరలు కూడా పెరిగిపోయి.. ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం కిలో బియ్యాన్ని రూ.200 వరకు రూ.450 వరకు విక్రయిస్తున్నారు. దీంతో ఇలా అన్ని నిత్యాసర ధరలు ఆమాంతం పెరిగిపోవడంతో.. తమకు పూట గడవడమే కష్టంగా మారిందని పాకిస్థాన్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది మే నెలలో.. ద్రవ్యోల్బణ రేటు రికార్డు స్థాయిలో 38 శాతం దాటింది. అలాగే గత ఏడాది ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. పట్టణ ప్రాంతాల్లో టమోటాలు 188 శాతం, ఉల్లిపాయలు 84 శాతం, మసాలాలు 49 శాతం పెరిగాయి. అలాగే చక్కెర 37 శాతం, మాంసం ధర 100 శాతం పెరిగింది. అంతర్జాతీయ ద్రవ్య నిధే ఆధారం ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్థాన్ వాటినుంచి గట్టెక్కేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) పైనే ప్రధానంగా ఆధారపడింది. ఇప్పటికే అనేకసార్లు ప్యాకేజీ పొందిన పాక్, మరోసారి చేతులు చాచింది. 1.1 బిలియన్ డాలర్ల ప్యాకేజీ విడుదలకు సంబంధించి ఐఎంఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిప్రకారం వచ్చే రెండు, మూడేళ్లలో అంతర్జాతీయ సంస్థ సూచించినట్లు పలు కార్యక్రమాలను అమలుచేయాల్సి ఉంటుంది. తాము ఈ సంక్షోభం నుంచి ఎప్పుడు బయటపడతామా అని పాక్ ప్రజలు ఆవేదనతో వేచి చూస్తూన్నారు. #telugu-news #pakistan #financial-crisis #inflation మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి