Pakistan: బస్సులో నుంచి 9 మంది కిడ్నాప్ చేసి చంపేసిన ఉగ్రవాదులు పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రోడ్డుపై వెళ్తున్న బస్సులోనుంచి 9 మందిని కిడ్నాప్ చేసి పర్వత ప్రాంతాలకు తీసుకెళ్లారు. ఇతర ప్రయాణికుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఓ వంతెన సమీపంలో 9 మంది మృతదేహాలను గుర్తించారు. By B Aravind 13 Apr 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రోడ్డుపై వెళ్తున్న బస్సులోనుంచి 9 మందిని కిడ్నాప్ చేసి చంపేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని నోష్కి జిల్లాలో హైవేపై కొందరు ముష్కరులు కాపు కాసారు. ఈ సమయంలోనే క్వెట్టా నుంచి తఫ్తాన్‌కు వెళ్తున్న ఓ బస్సును అడ్డుకున్నారు. వెంటనే ఆ బస్సులోనుంచి 9 మంది ప్రయాణికులను కిడ్నాప్ చేసి పర్వత ప్రాంతాలకు తీసుకెళ్లారు. Also Read: ఆ పానియాలను హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తీసేయ్యండి : కేంద్రం దీంతో ఆ బస్సులో ఉన్న ఇతర ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. ముష్కరులు వెళ్లిపోయిన తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి ఓ వంతెన సమీపంలో ఆ తొమ్మిది మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇదిలాఉండగా.. మరో ఘటనలో ఇదే రహదారిపై ప్రయాణిస్తున్న కారుపై కొందరు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. అయితే ఈ దాడులకు సంబంధించి ఇప్పటివరకు ఏ ఉగ్రసంస్థ కూడా బాధ్యత వహించలేదు. ఈ ఘటనలపై బలుచిస్థాన్ ముఖ్యమంత్రి మీర్ సర్ఫరాజ్ బుగ్తీ స్పందించారు. ఇలాంటి దుర్ఘటనకు పాల్పడ్జ ఉగ్రవాదులను క్షమించబోమని తెలిపారు. మరోవైపు మృతులు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ పేర్కొన్నారు. Also Read: షాపింగ్ మాల్‌లో దారుణం.. ఐదుగురిని కత్తులతో పొడిచి చంపిన దుండగులు #telugu-news #terrorists #pakisthan #millitants మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి