Delhi High Court : భార్య పదేపదే అలా చేయడం తప్పే! భర్త ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా భార్య పదేపదే తన పుట్టింటికి వెళ్లి పోవడం మానసిక క్రూరత్వం కిందకే వస్తుందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. దూరం పెరిగే కొద్ది వివాహ బంధం విచ్ఛిన్నం అవుతుందని జస్టిస్ సురేష్ కుమార్ కైత్ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. By Bhavana 05 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Delhi High Court : భర్త(Husband) ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా భార్య(Wife) పదేపదే తన పుట్టింటికి వెళ్లి పోవడం మానసిక క్రూరత్వం కిందకే వస్తుందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. దూరం పెరిగే కొద్ది వివాహ బంధం విచ్ఛిన్నం అవుతుందని జస్టిస్ సురేష్ కుమార్ కైత్ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. భార్య క్రూరత్వం, అకారణంగా విడిచిపెట్టిన కారణంగా భార్యభర్తలకు విడాకులు మంజూరు చేయోచ్చని వివరించింది. విడాకుల(Divorce) కోసం అప్లై చేసిన వ్యక్తి తన పిటిషన్ లో తన భార్ అకారణంగా తనను విడిచి ఏడు సందర్భాల్లో వెళ్లిపోయిందని దీనిని సవాల్ చేస్తూ అతను ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశాడు. అయితే ఫ్యామిలీ కోర్టు అతనికి విడాకులు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆ వ్యక్తి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. జస్టిస్ సురేష్ కుమార్ కైత్, జస్టిస్ నీనా బన్సల్ కృష్ణతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. 19 ఏళ్ల వివాహ బంధంలో ఏడు సార్లు, ఒక్కో సమయంలో 3 నుంచి 10 నెలల వరకు భార్య, భర్తను విడిచిపెట్టినట్లు కోర్టుకు సదరు వ్యక్తి తెలిపాడు. చాలా కాలం పాటు భార్య భర్తలు విడిగా ఉండడం వల్ల వివాహ బంధం(Marriage Life) కోలుకోని విధంగా విచ్చిన్నం కావొచ్చని.. ఇది మానసిక క్రూరత్వానికి నాంది అని పేర్కొంది. భార్య ఎప్పటికప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లడం క్రూరత్వానికి సంబంధించిన చర్యగా కోర్టు పేర్కొంది. ఇది మానసిక కేసు, భర్త వేదన, అతడికి విడాకులు ఇచ్చే హక్కు ఉందని కోర్టు పేర్కొంది. అత్తింటికి తిరిగి రావడానికి భార్య ఎలాంటి రాజీ ప్రయత్నాలు చేయలేదని, దీంతో వివాహ బంధాన్ని కొనసాగించే ఉద్దేశం ఆమెకు లేదని కనిపిస్తోందని కోర్టు వివరించింది. దీంతో కోర్టు విడాకుల్ని మంజూరు చేసింది. Also read: శ్రీవారి భక్తులకు శుభవార్త… వేసవిలో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు! #national #divorce #delhi-high-court #husband-and-wife మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి