Megha Engineering Scam: బయటపడుతున్న మేఘా అక్రమాలు.. మహారాష్ట్ర అసెంబ్లీలో మేఘా అవినీతి ప్రస్తావన

మేఘా ఇంజినీరింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో UBT శివసేన ఎమ్మెల్యే అనిల్ పరబ్‌.. మేఘా ఇంజినీరింగ్ అవినీతిని ప్రస్తావించారు. పూణే రింగ్‌రోడ్‌ టెండర్లు వాస్తవ ధర కంటే 40 శాతం ఎక్కువగా కేటాయించారని ఆరోపణలు చేశారు.

New Update
Megha Engineering Scam: బయటపడుతున్న మేఘా అక్రమాలు.. మహారాష్ట్ర అసెంబ్లీలో మేఘా అవినీతి ప్రస్తావన

మేఘా ఇంజినీరింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో సైతం మేఘా ఇంజినీరింగ్‌ అవినీతి ప్రకంపనలు రేపింది. UBT శివసేన ఎమ్మెల్యే అనిల్ పరబ్‌.. మేఘా ఇంజినీరింగ్ చేసిన అవినీతిని ప్రస్తావనకు తీసుకొచ్చారు. పూణే రింగ్‌రోడ్‌ టెండర్లు వాస్తవ ధర కంటే 40 శాతం ఎక్కువగా కేటాయించారని ఆరోపణలు చేశారు.

Also read: అధ్యక్ష పదవి ఎవరికీ ? ఈటల రాజేందర్ సంచలన ఇంటర్వ్యూ

గతంలో కూడా మేఘా ఇంజినీరింగ్ సంస్థపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఓ ప్రాజెక్టు విషయంలో మెఘా ఇంజినీరింగ్‌ సహా NMDC అధికారులపై గతంలోనే సీబీఐ కేసు నమోదు చేసింది. ఎలక్టోరల్ బాండ్‌ కొనుగోళ్లలో కూడా మేఘా టాప్‌ ప్లేస్‌లో ఉంది. విదేశీ బ్యాంక్‌ గ్యారెంటీ పేరుతో మేఘా కంపెనీ అక్రమాలకు పాల్పడింది. నకిలీ బ్యాంక్‌ గ్యారెంటీల పేరుతో రూ.2,500 కోట్ల స్కామ్‌ చేసింది. ఇటీవలే ఈ స్కామ్‌ను RTV వెలుగులోకి తీసుకొచ్చింది.

Also read: డ్రగ్స్‌ ఫ్రీ రాష్ట్రంగా చేయాలి.. పోలీసులకు సీఎం రేవంత్ ఆదేశం

Advertisment
Advertisment
తాజా కథనాలు