/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-24T155003.719-jpg.webp)
Telangana Mega DSC in February: తెలంగాణ రాష్ట్రంలో మెగా డీఎస్సీకి (DSC) విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి నెలలో 20వేల ఉద్యోగాలు భర్తీకి నియమకాలు చేపడతామని సీఎం రేవంత్ (CM Revanth Reddy) ఎన్నికల్లో భాగంగా చెప్పిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్రంలో ఎక్కడ ఉపాధ్యాయ ఖాళీలు ఉండకూడదని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలిచ్చారు. దీంతో ఈ యేడాది విద్యాశాఖలో పదవీ విరమణ చేయనున్న వారితో సహా పలు ఖాళీల లెక్కలను అధికారులు సేకరిస్తున్నారు. అంతేకాదు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ (Lok Sabha Elections) వచ్చేలోపు డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ జారీకి కసరత్తు కూడా జరుగుతోంది.
3, 800 మంది పదవీ విరమణ..
ఈ మేరకు ప్రస్తుతం రాష్ట్రంలో ఈ ఏడాది మొత్తం 3,800 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనున్నట్లు తెలుస్తోంది. నిజానికి వీరంతా 2021లోనే పదవీ విరమణ చేయాల్సింది. కానీ గత ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును మూడేళ్లు పొడగించడంతో ఇంకా విధులు నిర్వహిస్తు్న్నారు. మార్చి నెలాఖరు నుంచి పదవీ విరమణలు ప్రారంభం కానున్నాయి. ఇక కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే గణాంకాలను సేకరించింది. గతేడాది ఆగస్టులో 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేయగా.. ఖాళీల సంఖ్యను పెంచి మెగా డీఎస్సీ చేపట్టాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. పాత నోటిఫికేషన్‌కు మరో 5 వేల ఖాళీలను కలిపి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వనుంది. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపే అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్లా్న్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: OU: ఓయూ డిగ్రీ పరీక్ష తేదీలు ఖరారు.. షెడ్యూల్ రిలీజ్
హైదరాబాద్‌లో అధికం..
ఇక కేవలం హైదరాబాద్‌లోనే 370 మంది టీచర్లు పదవీ విరమణ చేయనుండగా.. మేడ్చల్‌లో-260, ఖమ్మం-240, రంగారెడ్డి 210, సంగారెడ్డి-200, నిజామాబాద్‌లో-190 ఉద్యోగాల ఖాళీలుండనున్నాయి. అతి తక్కువగా నారాయణపేటలో 40 మంది రిటైర్ కానున్నారు. రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1.22 లక్షలు కాగా ప్రస్తుతం 1.03 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారిలో ఈ యేడాది 3.7 శాతం మంది పదవీ విరమణ పొందనున్నారు. మార్చిలో 360 మంది, జూన్‌లో 700 మంది రిటైర్ కానున్నారు. ఇందులో 80 శాతం పురుషులుండటం విశేషం.
ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ..
ఇదిలావుంటే.. యూపీఎస్పీ తరహాలో గ్రూప్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) చెప్పారు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం ఫిబ్రవరిలో మెగా డీఎస్సీని నిర్వహించబోతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పేపర్ లీక్ లను దృష్టిలో పెట్టుకుని పరీక్షల నిర్వహణకు బలమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.