Bandi Sanjay: బండి సంజయ్‌పై కేసు నమోదు.. ఎందుకంటే

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ముస్లిం దాడిలో గాయపడ్డ బాధిత మహిళను పరామర్శించేందుకు ఆయన చెంగిచెర్ల వెళ్లారు. పోలీసుల బారికేడ్లను తోసుకుంటూ బండి సంజయ్‌ వెళ్లారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది.

New Update
Bandi sanjay: కాంగ్రెస్ హామీలను గాడిద గుడ్డుతో పోల్చిన బండి.. అదో అప్పుల పత్రం అంటూ!

Case Filed On Bandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌పై కేసు నమోదైంది. నిన్న చెంగిచెర్ల ఘటనలో (Chengicherla Incident) పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో.. నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు బండి సంజయ్‌తో పాటు మరో 9 మందిపై కేసు నమోదైంది. అయితే ముస్లింల దాడిలో గాయపడ్డ బాధిత మహిళను పరామర్శించేందుకు బధవారం బండి సంజయ్‌ చెంగచెర్లలోని పిట్టలబస్తీకి వెళ్లారు.

Also Read: దారుణం.. రైల్వేట్రాక్‌పై ప్రేమజంట ఆత్మహత్య

అప్పటికే అక్కడ పోలీసులు మోహరించారు. బారికేడ్లు వేశారు. అనుమతి లేదని చెప్పినా బారికేడ్లను తోసుకుంటూ.. పోలీసులను తొక్కుకుంటూ వెళ్లారని సీఐ నందీశ్వర్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

Also read: కేజ్రీవాల్‌కు ఊరట..జైలు నుంచి పరిపాలన చేయోచ్చు అని చెప్పిన ఢిల్లీ హైకోర్టు

Advertisment
Advertisment
తాజా కథనాలు