Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇక మీదట రూ.20 కే భోజనం ప్రయాణికులు , రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ కొత్త కొత్త ఆఫర్లను, సదుపాయాలను తీసుకువస్తోంది. ఇప్పుడు కొత్తగా సమ్మర్ రష్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇక మీదట రూ.20 కే భోజనాన్ని అందిస్తామని ప్రకటించింది. By Manogna alamuru 24 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Indian Railways Introduces ‘Economy Meals’ At 20rs: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ అందించింది. ట్రైన్‌లో ప్రయాణించే అందరూ సౌకర్యంగా ఉండేటట్లు ఏర్పాట్లుచేసింది. మామూలుగా జనరల్ కోచ్‌లో ఉన్నవారికి సదుపాయాలు అంతగా ఉండవు. అదీ కాక జనరల్‌ఓ ప్రయాణించావారు తక్కవు ఖర్చుతో ప్రయాణాలు చేయాలనుకుంటారు కూడా. అందుకే ఇప్పుడు వారిని దృష్టిలో పెట్టుకునే కొత్త పథకాన్ని అమలు చేయనుంది రైల్వే. దాని ప్రకారం జనరల్ కోచ్‌లో ప్రయాణించేవారికి రైల్వేశాఖ కేవలం రూ.20కే ఆహారాన్ని అందించనుంది. దాంతో పాటూ తారునీరును కూడా కేవలం 3.రూల కే ఇవ్వనుంది. ఇక ఎకానమీ ఫుడ్ పేరిట దేశవ్యాప్తంగా ఉన్న 100 రైల్వే స్టేషన్లలో 150 ఎకానమీ ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేసింది. రూ.20కి అందించే ఎకానమీ మీల్స్‌లో 7 పూరీలు , బంగాళ దుపంల కూర, పచ్చడిని ఇస్తారు. అదే రూ.50కి అందించే మీల్లో అయితే అన్నం, కిచిడీ, ఛోలే-కుల్చే, ఛోలే-భటూరే, పావ్ భాజీ, మసాలా దోశల్లో ఒక దానిని ఎంచుకోవచ్చు. మంచి ఆహారమే లక్ష్యంగా... రైల్వే ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకునే 20రూ.లకే భోజనం నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది రైల్వే శాఖ (Indian Railway). తక్కువ ధరలకు పౌష్టికాహారం, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడమే తమ లక్ష్యమని తెలిపింది. ఈ ఎకానమీ ఫుడ్ కౌంటర్లను జనరల్ క్లాస్ కోచ్‌ల బయట ప్రాఱంబించినట్లు తెలిపారు ఉత్తర రైల్వేలోని లఖ్‌నవూ డివిజన్ సీనియర్ డీసీఎం రేఖా శర్మ. ఎకానమీ ఫుడ్ క్వాలిటీని రైల్వే శాఖ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుందని...నాసి రకం భోజనానికి తావే లేదని అన్నారు. 100 స్టేషన్లలో .. మొదటగా ఈ ప్రయోగాన్ని ఇండియాలోని వంద స్టేషన్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిలో సక్సెస్ అయితే దేశంలో అన్ని స్టేషన్లలోనూ ఏర్పాటు చేస్తారు. భారతీయ రైల్వేలోని 100 స్టేషన్లలో 150 ఎకానమీ ఫుడ్ కౌంటర్లు నిర్వహిస్తున్నారు. ఈశాన్య రైల్వేలోని గోరఖ్ పుర్, లఖ్ నవూ జంక్షన్, ఛప్రా జంక్షన్, సివాన్ జంక్షన్, మౌ జంక్షన్, బనారస్ జంక్షన్, కత్ గోడం స్టేషన్‌లలో ఎకానమీ ఫుడ్ కౌంటర్లు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో దక్షిణ భారతల రైల్వే, ఈశాన్య రైల్వేల్లో కూడా ఇవి అందుబాటులోకి వస్తాయి. 20రూ. మీల్స్‌తో పాటూ పలు కాంబోలు కూడా అందుబాటులో ఉంటాయి. వాటి ధర కూడా, 120రూ, 50 రూలు మాత్రమే ఉంటుంది. Also Read:Technology: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్..ఇంటర్నెట్ లేకుండానే ఫోటోలు #indian-railways #food #cheap #meals మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి