Yoga: యోగిక్ సూక్ష్మ వ్యాయామ నేషనల్ వర్క్‌షాప్‌ ప్రారంభం..

మోరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యోగా (MDNIY).. యోగిక్ సూక్ష్మ వ్యాయామ అనే పేరుతో వారంతపు నేషనల్ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తోంది. ఢిల్లీలోని ఆ సంస్థ ప్రాంగణంలో జులై 8 నుంచి ఇది ప్రారంభమైంది. MDNIY డైరెక్టర్‌ డా.కాశీనాథ్ సోమగండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

New Update
Yoga: యోగిక్ సూక్ష్మ వ్యాయామ నేషనల్ వర్క్‌షాప్‌ ప్రారంభం..

మోరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యోగా (MDNIY).. యోగిక్ సూక్ష్మ వ్యాయామ అనే పేరుతో వారంతపు నేషనల్ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తోంది. ఢిల్లీలోని ఆ సంస్థ ప్రాంగణంలో జులై 8 నుంచి ఇది ప్రారంభమైంది. MDNIY డైరెక్టర్‌ డా.కాశీనాథ్ సోమగండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూక్ష్మ క్రియలు మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో వివరించారు. మానవ జీవితంలో యోగా ప్రాముఖ్యతను ఎత్తిచూపిన ఆయన.. దీని గురించి మరింతగా తెలుసుకునేందుకు, శాస్త్రీయ విధానాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతి యోగాసనంపై వేరవేరుగా వర్క్‌షాప్‌లు నిర్వహించాలని సూచించారు.

Also read: మోదీ-పుతిన్ ఆలింగనం.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

వేలాది మందికి ఇండియాతో పాటు విదేశాల్లో యోగాపై శిక్షణ ఇచ్చిన ప్రముఖ యోగా నిపుణులు బాల్‌ ముఖుంద్‌ సింగ్ ఈ వర్క్‌షాప్‌ను నడిపిస్తున్నారు. ఇక యోగా ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఇందు శర్మ, యోగా శిక్షకుడు రాహుల్ సింగ్ చౌహన్ ఈ కార్యక్రమాన్ని చూసుకుంటున్నారు.

ఇదిలాఉండగా.. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే యోగాసనాలు చేయడం చాలా మంచిది. సోమరితనం పోయి.. ఉత్సాహం, శక్తి లభిస్తుంది. రోజంతా ఎలాంటి ఒత్తిళ్లు, ఆందోళనలు లేకుండా ప్రశాంతంగా గడుపుతారు. యోగా చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. త్రికోణాసనం, వీరభద్రాసనం, బాలాసనం, గరుడాసనం, ధనురాసనం లాంటి అనేక ఆసనాలు ఈ యోగాలో ఉన్నాయి.

Also Read: టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్‌గంభీర్‌.. జై షా అధికారిక ప్రకటన!

Advertisment
Advertisment
తాజా కథనాలు