Mayavathi: ఇండియా కూటమితో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన మాయావతి లోక్‌సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి క్లారిటీ ఇచ్చారు. పార్టీ పొత్తుపై వస్తు్న్న వదంతులను నమ్మొద్దని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత పొత్తు గురించి ఆలోచిస్తామని పేర్కొన్నారు. By B Aravind 19 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి లోక్‌సభ ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు ప్రాణాళికలు రచిస్తున్నాయి. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించే లక్ష్యంతో ఇండియా కూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటికే ఈ కూటమి నుంచి.. అరవింద్ కేజ్రీవాల్, నితీష్ కుమార్, మమతా బెనర్జీ లాంటి కీలక నేతలు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమితో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. Also Read: ముగిసిన నాలుగో విడత చర్చలు.. ఆ పంటలకే కనీస మద్దతు ధర ఎన్నికల తర్వాత ఆలోచిస్తాం రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని సోమవారం తెలియజేశారు. ఎన్నికలు జరిగిన తర్వాత పొత్తుపై ఆలోచిస్తామని పేర్కొన్నారు. ఇంతకుముందే.. తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని బీఎస్పీ స్పష్టం చేసింది. కానీ దీనికి భిన్నంగా వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. బీఎస్పీతో పొత్తు లేకుండా ఇక్కడ కొన్ని పార్టీలు రాణించలేవని.. కానీ పార్టీ ఒంటరిగానే ముందుకెళ్తుందని.. ప్రజల సంక్షేమమని ముఖ్యమని ఎక్స్ వేదికగా వెల్లడించింది. వదంతులు నమ్మొద్దు అలాగే లక్నోలోని ఆమె మీడియాతో పొత్తుల గురించి మాట్లాడారు. దీనివల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం లేదన్నారు. దేశంలో ఎన్నో పార్టీలు తమతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నాయని.. కానీ తమకు అలాంటి ఆలోచన లేదని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాక పొత్తుపై ఆలోచిస్తామన్నారు. పేదలు, దోపిడీ, నిర్లక్ష్యానికి గురైన వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని.. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని.. ప్రజలు వదంతులను నమ్మొద్దని పేర్కొన్నారు. Also Read: నెలలో ఐదు రోజులు ఆడవాళ్లు బట్టలు వేసుకోని ఊరు..అదెక్కడుందో తెలుసా.. #telugu-news #national-news #bsp #mayavathi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి