దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ఎస్సై.. రాజస్థాన్‌లోని ఎలక్షన్ డ్యూటీ చేస్తున్న ఓ ఎస్సై.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది. చిన్నారిని తన రూమ్‌కు పిలుపించుకున్న ఎస్సై భూపేంద్ర సింగ్.. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేశారు. By B Aravind 11 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి నేరం చేసినవాళ్లని అరెస్టు చేస్తూప్రజలను రక్షించడం పోలీసుల విధి. అయితే ఓ పోలీస్ అధికారి చేసిన పని సిగ్గుతో తలదించుకునేలా చేస్తోంది. ఓ ఎస్సై ఏకంగా నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది. ఈ దారుణమైన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 'దౌసా జిల్లాలో.. భూపేంద్ర సింగ్ అనే ఎస్సై ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాడు. అయితే అతడు ఓ నాలుగేళ్ల చిన్నారిని తన రూమ్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ చిన్నారి కుటుంబ సభ్యులు ఆ ఎస్సైపై కేసు నమోదు చేశారని' భజరంగ్ సింగ్ అనే పోలీస్ అధికారి తెలిపారు. Also Read: ప్రేక్షకుల హృదయాల్లో చంద్రమోహన్‌ది చెరగని ముద్ర.. కేసీఆర్, చిరంజీవితో పాటు ప్రముఖలు ఏమన్నారంటే? చిన్నారికి ప్రస్తుతం వైద్య పరీక్షలు జరుగుతున్నాయని.. అలాగే నిందితుడిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో నిరసనలు చేశారు. అంతేకాదు నిందితుడు భూపేంద్ర సింగ్‌ను పోలీస్‌లకు అప్పగించే ముందు కూడా స్థానికులు చితకబాదారు. సమాచారం మేరకు బీజేపీ ఎంపీ కిరోడి లాల్ మీనా ఘటనాస్థలాని చేరుకున్నారు. ఇది అవమానకరమైన సంఘటన అని వ్యాఖ్యానించారు. ఎలక్షన్ల కంటే ఆ చిన్నారి కుటుంబానికి జరగాల్సిన న్యాయానికే తన ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ఇక ఆ చిన్నారి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందిస్తామని హామి ఇచ్చారు. Also Read: జైలు నుంచి బయటకు వచ్చిన మనీష్ సిసోడియా.. ఎందుకంటే.. #telugu-news #national-news #rape మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి