Breaking : ఎన్నికల వేళ బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి బీజాపూర్‌లో మళ్ళీ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్‌కౌంటర్ అనంతరం అధికారులు ఆయుధాలను భారీగా సీజ్ చేశారు. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. By Vijaya Nimma 10 May 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Encounter : ఛత్తీస్‌గడ్(Chhattisgarh)లో మరోసారి కాల్పుల మోత మోగింది. మావోయిస్టులు(Maoists), పోలీసులకు(Police) మధ్య భీకర కాల్పులు చోటుచేసుకుంది. బీజాపూర్‌లోని పిడియా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే ఈ కాల్పులపై అధికారంగా పోలీసులు ధ్రువీకరించలేదు. 1000 మంది పోలీస్ బలగాలతో కూంబింగ్ నిర్వహించారు. ఉదయం నుంచి సెర్చింగ్ కొనసాగుతోంది. పోలీస్ బలగాలు అడవిని జల్లెడ పడుతున్నారు. ఎన్‌కౌంటర్‌ను ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తున్నారు. బీజాపూర్, సుక్మా, దంతెవాడ ఎస్పీలు ఇటీవల ఎన్‌కౌంటర్‌లో సుమారు 40 మంది మావోల మృతి చెందినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: ఈ పదాల గురించి తెలుసుకోండి.. పిల్లలకు మంచి అలవాట్లు వస్తాయి ఎన్‌కౌంటర్ అనంతరం అధికారులు ఆయుధాలను భారీగా సీజ్ చేశారు. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్నికల(Elections) వేళ ఛత్తీస్గడ్లో మరో ఎన్‌కౌంటర్ జరగటంతో ప్రజలందరూ భయపడుతున్నారు. శుక్రవారం నాడు భద్రతా బలగాలు యాంటీ నక్సల్ ఆపరేషన్లో భాగంగా గస్తీ చేస్తుండగా నక్సలైట్లు కాల్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: వైసీపీది మాటల ప్రభుత్వమే.. చేతల ప్రభుత్వం కాదు: టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ #police #encounter #maoists #2024-elections #bijapur మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి