Watch Video: కుక్క పిల్లను నేలకేసి కొట్టిన ఘటన.. స్పందించిన మధ్యప్రదేశ్ సీఎం మధ్యప్రదేశ్‌లోని ఓ వ్యక్తి కుక్క పిల్లను నేలకోసి కొట్టిన ఘటన వైరల్ అవ్వడంతో.. ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ స్పందించారు. ఇలాంటి వాటిని సహించకూడదని.. నిందితుడిపై చర్యలు తీసుకుంటామని ఎక్స్‌లో స్పందించారు. చివరికి పోలీసులు ఆ నిందుతుడ్ని అదుపులోకి తీసుకున్నారు. By B Aravind 10 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి మూగజీవాల పట్ల కొంతమంది వ్యక్తులు తమ రాక్షసత్వాన్ని చూపిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఓ వ్యక్తి.. కుక్కపిల్లను నేలకేసి దారణంగా కొట్టి చంపిన ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపింది. గుణ అనే జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఈ దృశ్యం ఎంతో భయంగా ఉంది. మూగజీవి పట్ల ఆ వ్యక్తి ప్రవర్తించిన తీరు ఆందోళనకరంగా ఉంది. అతిడికి శిక్ష పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదంటూ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌క ట్యాగ్ చేశారు. అయితే ఈ వీడియోపై సీఎం కూడా స్పందించారు. ఇలాంటి భయంకరమైన ఘటన చూసి ఆందోళన చెందానని.. ఇలాంటి చర్యలను సహించకూడదని.. నిందితుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. చివరికి పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. Also Read: కరీంనగర్ పార్లమెంట్ పై ‘బండి’ గురి.. రోడ్ మ్యాప్ రెడీ! వీడియోను గమనిస్తే ఓ వ్యక్తి దుకాణం ముందు కూర్చొని ఉన్నాడు. ఆ సమయమలో రెండు కుక్క పిల్లలు అతడి వద్దకు వచ్చాయి. వాటిని చూసి విసుగు చెందిన ఆ నిందితుడు ఓ కుక్క పిల్లను బలంగా నేలకేసి కొట్టడంతో అది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియో చూసిన నెటీజన్లు నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Deeply disturbed by the horrifying incident. Swift and strict action will be taken to ensure justice is served. We unequivocally condemn such acts of barbarism, and the individual responsible will face the consequences. https://t.co/yYdCyKli64 — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) December 10, 2023 Also Read: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్ #telugu-news #national-news #madyapradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి