ఎన్నికలకు ముందే అరెస్టులకు కుట్ర.. మమత బెనర్జీ సంచలన ఆరోపణలు By B Aravind 01 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల కంటే ముందే విపక్ష నేతలందరినీ అరెస్టు చేయాలని బీజేపీ కుట్రకు పాల్పడుతోందని ఆరోపించారు. ఆ తర్వాత ‘ఖాళీ దేశంలో’ వాళ్లకు వాళ్లే ఓట్లు వేసుకోవాలని చూస్తున్నారంటూ విమర్శించారు. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు చాలామందికి ఇప్పటికే ఈడీ నోటీసులు ఇచ్చిందని.. అలాగే విపక్ష పార్టీల ఎంపీల ఫోన్లు కూడా హ్యాకింగ్‌కు గురవుతున్నాయని ధ్వజమెత్తారు. అలాగే ఉపాధి హామీ పథకం కింద తమ రాష్ట్రానికి వచ్చే పెండింగు నిధులు నవంబర్ 16లోగా విడుదల చేయాలని డిమండ్ చేశారు. ఒకవేళ చేయకపోతే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. ముందుగా నవంబర్ 1 వరకే డెడ్‌లైన్ విధించినప్పటికీ.. గవర్నర్ ఇచ్చిన హామీ మేరకు మరికొన్ని రోజులు ఎదురుచూస్తామని చెప్పారు. Also read:మహువా లోక్‌సభ ఖాతాను ఆ దేశం నుంచి 47 సార్లు వినియోగించారు: దూబే మరోవైపు ఎన్నికలకు ముందు ఇండియా కూటమి నేతలను అరెస్టు చేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని ఆమ్‌ఆద్మీ పార్టీ ఆరోపణలు చేసింది. అయితే ఈ క్రమంలోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌దే తొలి అరెస్టు కానుందని చెప్పింది. నవంబర్ 2న ఆప్ అధినేత కేజ్రీవాల్.. ఈడీ ముందు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే ఆప్ ఇలా స్పందించింది. అలాగే విపక్షాల కూటమి ఇండియా ఏర్పాటుతో బీజేపీ ఉలిక్కిపడిందని ఆప్ నేత రాఘవ్ చద్దా అన్నారు. దర్యాప్తు సంస్థలు పెట్టిన కేసుల్లో దాదాపు 95శాతం విపక్ష నేతలమీదే ఉన్నాయని తెలిపారు. కూటమిలో కీలక నేతలనే బీజేపీ లక్ష్యంగా చేసుకుందనే విషయం విశ్వసనీయ వర్గాల ద్వారా తమకు తెలిసినట్లు పేరొన్నారు. అయితే ఇందులో తొలి అరెస్టు అరవింద్ కేజ్రీవాల్‌దే కానుందని చెప్పారు. #telugu-news #national-news #tmc #mamata-benerjee మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి