Modi Vs Mamatha : మోడీని నేరుగా ఢీకొట్టే దమ్మున్న నేత మమతనే.. బెనర్జీ మొండితనానికి ఇదే సజీవ ఉదాహరణ!

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బెంగాల్‌ గురించి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. బెంగాల్‌ ఫైట్‌ను దీదీ వర్సెస్ మోడీ ఫైట్‌గా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో ఎంతోమంది నాయకులున్నా మోడీని నేరుగా ఢీకొట్టే నేతగా మమతకు మాత్రమే ఎందుకు పేరుందో తెలుసుకుందాం!

New Update
Mamata Banerjee: కేంద్రంలో చట్ట విరుద్ధంగా ప్రభుత్వం కొలువుదీరుతోంది..మమతా బెనర్జీ

Mamatha : ముందు నుంచి మాట్లాడే ధైర్యం లేక వెనుక నుంచి చేయాల్సింది చేసే రాజకీయ నాయకులుంటారు. ముఖంమీదే మాట్లాడే నాయకులూ ఉంటారు. అయితే ముఖంపై కొట్టి మాట్లాడే నాయకులు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. మొండితనం, పోరాటతత్వానికి నిలువెత్తు రూపం బెంగాల్‌ ఫైర్‌బ్రాండ్‌ మమతా బెనర్జి(Mamata Banerjee). లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) సమీపిస్తున్న వేళ బెంగాల్‌ గురించి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. బెంగాల్‌ ఫైట్‌ను దీదీ వర్సెస్ మోడీ ఫైట్‌గా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో ఎంతో మంది నాయకులున్నా మోడీని నేరుగా ఢీకొట్టే నేతగా మమతకు మాత్రమే ఎందుకు పేరుందో ఇవాళ తెలుసుకుందాం!

బెనర్జీ మొండితనానికి సజీవ ఉదాహరణ..
పశ్చిమ బెంగాల్(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొండితనానికి సజీవ ఉదహరణ. కోల్‌కతా(Kolkata) లోని ధర్మతల కూడలిలో ఒకప్పుడు మమతను లాఠీలతో కొట్టిన కమ్యూనిస్ట్ ప్రభుత్వ పోలీసులు ఇప్పుడమేకు సలాం చేస్తున్నారు. మమతా బెనర్జీ జనవరి 5, 1955న కలకత్తాలోని ఒక పేద కుటుంబంలో జన్మించారు. మమతకి 17 ఏళ్లు ఉన్నప్పుడు ఆమె తండ్రి మరణించారు. ఇంటి ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉండడంతో సరైన వైద్యం కూడా చేయించుకోలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఇంటి బాధ్యతను మమత భుజస్కంధాలపై వేసుకున్నారు. దీదీగా ప్రసిద్ధి చెందిన మమత కలకత్తాలోని యోగమాయా దేవి కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. దీని తరువాత అతను కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి ఇస్లామిక్ హిస్టరీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివానే. ఆ తర్వాత యోగేష్ చంద్ర చౌదరి లా కాలేజీ నుంచి న్యాయ పట్టా కూడా పొందారు.

మమత చాలా చిన్న వయసులోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకుని కాంగ్రెస్(Congress) పార్టీలో చేరారు. మొదట మహిళా కాంగ్రెస్‌, ఆ తర్వాత అఖిల భారత యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1975లో పశ్చిమ బెంగాల్‌లో ఇందిరా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 1978లో కలకత్తా సౌత్ జిల్లా కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1984లో మమత కలకత్తా సౌత్ స్థానం నుంచి గెలిచి తొలిసారి లోక్‌సభకు చేరారు. 1991లో మమత మళ్లీ ఎంపీ కావడంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత మమత వెనుదిరిగి చూసుకోలేదు. ఆమె మళ్లీ 1996లో లోక్‌సభకు చేరుకున్నారు. అయితే, 1997లో ఆమె కాంగ్రెస్‌తో విడిపోయి, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పేరుతో తన సొంత పార్టీని స్థాపించించారు. నేడు బెంగాల్‌లో ప్రభుత్వాన్ని నడుపుతోన్న పార్టీ ఇదే!

Also Read : చైనాతో సత్సంబంధాలు చాలా అవసరం-ప్రధాని మోదీ

మమతా బెనర్జీకే సాధ్యమైంది..
బెంగాల్‌లో దశాబ్దాలుగా అధికారంలో ఉన్న వామపక్షాలను కూకటివేళ్లతో పెకిలించడం మమతా బెనర్జీకే సాధ్యమైంది. లెఫ్ట్‌ పార్టీలపై పోరాటంలో ఆమె ప్రాణాంతకంగా దాడులకు గురయ్యారు. 1993లో మమతా బెనర్జీ ఫోటోతో కూడిన ఓటర్ ఐడిని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో భాగంగా కలకత్తాలో ఉన్న బెంగాల్ ప్రభుత్వ సచివాలయం రైటర్స్ బిల్డింగ్ వైపు కవాతు చేస్తుండగా పోలీసులతో ఘర్షణ జరిగింది. పోలీసులు కాల్పులు జరపగా, మమతతో పోరాడుతున్న 14 మంది చనిపోయారు. మమతా బెనర్జీ తీవ్రంగా గాయపడ్డారు. అయినా పట్టు వదలలేదు.మమత రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు అనుభవించారు. పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పేయి మరియు డాక్టర్ మన్మోహన్ సింగ్ వంటి ప్రధాన మంత్రులతో కలిసి పనిచేశారు. బీజేపీ(BJP) తో తృణమూల్‌ కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకున్న తర్వాత వాజ్‌పేయి ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా పనిచేశారు. భారతదేశంలో రైల్వే మంత్రి అయిన మొదటి మహిళా ఎంపీ ఆమె. 2012లో టైమ్ మ్యాగజైన్ 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో మమత కూడా ఒకరు.

2005లో మమత రాజకీయ జీవితం కీలక మలుపు తిరిగింది. బెంగాల్‌లో నాటి ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యతో ఆమె తాడుపెడో తేల్చుకున్నారు. పారిశ్రామికీకరణ కోసం బెంగాల్‌లోని నందిగ్రామ్ సమీపంలోని సింగూర్‌లో టాటాకు చెందిన లఖ్టాకియా కారు నానో ఉత్పత్తి కోసం భూమిని సేకరించింది బుద్ధదేవ్‌ ప్రభుత్వం. రైతుల నుంచి బలవంతంగా భూమిని తీసుకున్నారని ఆరోపిస్తూ మమత ఉద్యమం ప్రారంభించారు. దీంతో ప్రజలకు మమత లెఫ్ట్‌ పార్టీలకు చెక్‌ పెట్టే నాయకురాలిగా ఉద్భవించారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్‌లో వామపక్షాల పాలనను అంతమొందించి ముఖ్యమంత్రి అయ్యారు. 2016, 2021లో కూడా బెంగాల్‌లో తృణమూల్ ప్రభుత్వమే ఏర్పడింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు