Trump : ట్రంప్‌ కు మరో షాక్‌.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడంటున్న మరో రాష్ట్రం!

రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఊహించని షాక్‌ తగిలింది.మైన్‌ ప్రైమరీ బ్యాలెట్‌ పోరు నుంచి ట్రంప్‌ పేరును తీసివేస్తున్నట్లు ఆ స్టేట్‌ ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు.

New Update
Trump : ట్రంప్‌ కు మరో షాక్‌.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడంటున్న మరో రాష్ట్రం!

Shock On Donald Trump : అమెరికా(America) అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు మరోసారి బరిలోకి దిగిన రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) మరోసారి ఊహించని షాక్‌ తగిలింది. ఇప్పటికే ఆయనకు ఓ షాక్‌ తగలగా మరోసారి షాక్‌ తగిలింది. ఇప్పటికే దేశాధ్యక్షుడి పదవికి ఆయన పోటీచేసేందుకు సరిపోరంటూ కొలరాడో సుప్రీం కోర్టు ఓ తీర్పును వెల్లడించింది.

ఈ క్రమంలోనే తాజాగా ఆయన మీద మరో రాష్ట్రం వేటు వేసింది. మైన్‌ ప్రైమరీ బ్యాలెట్‌ పోరు నుంచి ట్రంప్‌ పేరును తీసివేస్తున్నట్లు ఆ స్టేట్‌ ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు. కొలరాడో తో పాటు, మైనే , కొలరాడో తీర్పును ఫాలో అయితే మాత్రం ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల పోటీలకు అనర్హుడవుతారని తెలుస్తోంది.

అయితే కొలరాడో సుప్రీం కోర్టు(Colorado Supreme Court) ఇచ్చిన తీర్పు పై పబ్లికన్‌ పార్టీ సుప్రీం కోర్టులో సవాల్‌ చేసింది. అమెరికా సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పు మీదే ప్రస్తుతం ట్రంప్‌ భవిష్యత్‌ ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది. అమెరికా చరిత్రలోనే ఓ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి పేరును ఇలా బ్యాలెట్‌ నుంచి ఓ ఎన్నికల అధికారి తొలగించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి.

అయితే దీని గురించి ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు. ఇది అంతా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌(Joe Biden) కుట్ర పూరితంగా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ‘‘ఎన్నికల్లో పోటీ చేయకుండా నన్ను నిలువరించేందుకు జో బైడెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆయన సమూహం చేస్తున్న విపరీత చర్యలివి. అధ్యక్ష ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు వారు అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. జో బైడెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రజాస్వామ్యానికి ముప్పు. ఓడిపోతారనే ఇలా చట్టసంస్థలను ఆయుధాలుగా చేసుకుని ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారు’’ అని ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండిపడ్డారు.

Also read: బాబోయ్ బంగారం.. షాక్ మామూలుగా లేదు.. ఎంత పెరిగిందంటే..

Advertisment
Advertisment
తాజా కథనాలు