Mahesh Babu : కుటుంబంతో విదేశాలకు వెళ్తున్న సూపర్‌ స్టార్‌ మహేష్‌..ఎందుకంటే!

గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న మహేష్‌ బాబు కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తున్నారు. కొత్త సంవత్సరం వేడుకలను అక్కడే జరుపుకోనున్నట్లు సమాచారం. అక్కడి నుంచి రాగానే గుంటూరు కారం సినిమా ప్రమోషన్స్‌ తో బిజీగా ఉంటారని సమాచారం.

New Update
Mahesh Babu : కుటుంబంతో విదేశాలకు వెళ్తున్న సూపర్‌ స్టార్‌ మహేష్‌..ఎందుకంటే!

Mahesh Babu Family : సంక్రాంతి(Sankranti) కానుకగా సూపర్‌ స్టార్‌ మహేశ్‌(Mahesh Babu) సినిమా గుంటూరు కారం(Gunturu Karaam) విడుదల చేయాలని చిత్ర బృందం చూస్తుంది. అందుకే ఈ సినిమా షూటింగ్‌ ని శరవేగంగా జరుపుతోంది. ఈ సినిమా కోసం హీరోయిన్‌ శ్రీలీల(Sreeleela) ఏకంగా తన ఎంబీబీఎస్‌ పరీక్షలను కూడా వదిలేసి మరి చిత్రీకరణకు వచ్చేసింది.

సినిమాను ఎలాగైనా సంక్రాంతికి విడుదల చేయాలని ప్రతి ఒక్కరు ఎంతో డెడికేషన్‌ తో పని చేస్తున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే దాదాపు పూర్తి అయినట్లు తెలుస్తోంది. చాలా రోజుల తరువాత మహేశ్‌ త్రివిక్రమ్‌ కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో అభిమానులు కూడా సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా గురించి రకరకాల వార్తలు నెట్టింట హల్ చల్ చేశాయి. అనుకున్నట్లుగానే ముందుగా ఈ సినిమా నుంచి పొడుగు కాళ్ల సుందరి పూజా ని తప్పించి ఈ స్థానంలో శ్రీలీలను చేర్చారు. ఆ తరువాత మరో హీరోయిన్‌ మీనాక్షి చౌదరిని కూడా సినిమాలోనికి తీసుకుని వచ్చారు.

ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన కొన్ని గ్లింప్స్‌ ప్రేక్షకులను, మహేశ్‌ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో ప్రకాష్‌ రాజ్‌, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌ లోనే జరుగుతుంది. ఈ సాంగ్‌ పూర్తయితే సినిమా మొత్తం కంప్లీట్ అయినట్లే అని తెలుస్తుంది. ఇక సినిమాలోని కొన్ని చిన్న చిన్న ఫ్యాచ్ వర్క్ లను కూడా ఈ నెల ఆఖరిలో పూర్తి చెయ్యనున్నట్లు తెలుస్తుంది..

ఈ పాట పూర్తి కాగానే మహేష్‌ తన ఫ్యామిలీతో కలిసి ఫారిన్‌ ట్రిప్‌ కు వెళ్తున్నట్లు సమాచారం. అక్కడే కొత్త సంవత్సరం వేడుకలను అక్కడే జరుపుకోనున్నట్లు తెలుస్తుంది. ఫారిన్‌ నుంచి తిరిగి రాగానే ‘గుంటూరు కారం’ ప్రమోషన్స్‌ తో బిజీ అవుతారు..  ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

Also read: రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు..భారీగా పెరిగిన రద్దీ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Actress Divi: నాజూకు నడుము అందాలతో బిగ్ బాస్ బ్యూటీ హొయలు.. ఫొటోలు చూశారా?

బిగ్ బాస్ బ్యూటీ దివి మరో సారి తన ఆకర్షణీయమైన శైలితో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా స్టైలిష్ లెహంగాలో దివి ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి.

New Update
Advertisment
Advertisment
Advertisment