Mahesh Babu: ఏం ఉన్నాడురా బాబు... లుక్‌ మామూలుగా లేదుగా!

మహేష్‌ బాబు ఎప్పుడూ కూడా సోషల్‌ మీడియాలో తన కొత్త కొత్త లుక్స్‌ తో ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మరో లేటెస్ట్‌ ఫోటోతో అభిమానుల ముందుకు వచ్చాడు మహేష్‌ బాబు.మహేష్‌ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌ లో ఓ సినిమా తీయబోతున్నాడనే విషయం తెలిసిందే.

New Update
Mahesh Babu: ఏం ఉన్నాడురా బాబు... లుక్‌ మామూలుగా లేదుగా!

Mahesh Babu in Stylish New Look: టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం రాజమౌళి (Rajamouli) డైరెక్షన్‌ లో ఓ సినిమా తీయబోతున్నాడనే విషయం తెలిసిందే. మహేష్‌ బాబు గుంటూరు కారం(Guntur Kaaram)  సినిమా ప్రేక్షకుల వద్ద మంచి మార్కులే సంపాదించుకుంది. ఇప్పటికే రాజమౌళి సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు ఎప్పుడో పూర్తి చేసుకుంది.

దీంతో సినిమా షూటింగ్‌ కోసం మహేష్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్‌ బాబు ఎప్పుడూ కూడా సోషల్‌ మీడియాలో తన కొత్త కొత్త లుక్స్‌ తో ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మరో లేటెస్ట్‌ ఫోటోతో అభిమానుల ముందుకు వచ్చాడు మహేష్‌ బాబు. రాజమౌళి సినిమా కోసం మహేష్‌ జిమ్‌ లో కష్టపడుతున్న వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

రాజమౌళి కూడా ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ ఫైనల్‌ చేయడంతో పాటు ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా చేస్తున్నారు. ఆర్టిస్టులను ఫైనల్‌ చేసే వేటలో ఉన్నారు. మరో రెండు మూడు నెలల్లో సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా రాబోతున్న ఈ సినిమా కోసం మహేష్‌ ఏకంగా 9 రకాల గెటప్ లను ట్రై చేశారట.

అమెజాన్‌ ఫారెస్ట్‌ నేపథ్యంలో సాగనున్న ఈ కథ కోసం ఓ లుక్‌ ను కూడా ఫైనల్‌ చేశారు. ఈ సినిమాను ఉగాది రోజు నుంచి మొదలు పెట్టబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిత్ర బృంద నుంచి మాత్రం ఎలాంటి అప్‌డేట్‌ లేదు. దీంతో సినిమా ఓపెనింగ్‌ ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. ఈ సినిమాకు వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్‌ ని అనుకుంటున్నట్లు సినీ వర్గాల టాక్‌.

Also read: రాబోయే 5 రోజుల్లో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు