Kannappa Movie : మహాశివరాత్రి రోజు అదిరిపోయే అప్డేట్‌ తో రాబోతున్న కన్నప్ప టీం!

భక్త కన్నప్ప చిత్రం నుంచి మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కీలక అప్డేట్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను మధ్యాహ్నం 2.55 గంటలకు విడుదల చేస్తామని తెలిపారు.

New Update
Kannappa Movie : మహాశివరాత్రి రోజు అదిరిపోయే అప్డేట్‌ తో రాబోతున్న కన్నప్ప టీం!

Manchu Vishnu : మంచు విష్ణు(Manchu Vishnu) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం '' కన్నప్ప''(Kannappa) పరమ శివ భక్తుడైన కన్నప్ప జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా(PAN India) లెవల్లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ది బ్రేవేస్ట్‌ వారియర్‌, ది అల్టిమేట్‌ డీవోటి అనేది ఉపశీర్షికగా ఉంది. ఈ చిత్రం షూటింగ్‌ విదేశాల్లో చాలా వేగంగా జరుగుతుంది. దాదాపు ముప్పావు వంతు సినిమా భాగాన్ని విదేశాల్లోనే చిత్రీకరిస్తున్నారు చిత్ర నిర్మాతలు.

థాయ్‌లాండ్‌(Thailand) లో ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సుమారు 600 మంది హాలీవుడ్ ప్రముఖులు రాత్రిపగలు కష్టపడుతున్నారు. రెండో షెడ్యూల్‌ కోసం ఈ చిత్ర బృందం న్యూజిలాండ్‌ నుంచి ఇండియాకు వస్తున్నట్లు మోహన్‌ బాబు కొద్ది రోజుల క్రితం తెలిపారు. ఈ చిత్రంలో మంచు ఫ్యామిలీ మూడు తరాల నటులు ఉండడం విశేషం.

మంచు మోహన్‌ బాబు తనయుడు మంచు విష్ణు ఆయన కుమారుడు భక్తవత్సల్‌ కూడా ఈ సినిమాలో నటిస్తుండడంతో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఈ చిత్రం నుంచి ఓ కీలక అప్డేట్‌ ను చిత్ర మేకర్స్‌ ప్రకటించారు. శుక్రవారం మహాశివరాత్రిని పురస్కరించుకుని చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను మధ్యాహ్నం 2.55 గంటలకు విడుదల చేస్తామని తెలిపారు.

కన్నప్ప పాత్రలో మంచు విష్ణు నటిస్తుండగా మహా శివుని(Lord Shiva) పాత్రలో మెప్పించడానికి ప్రభాస్‌(Prabhas) రెడీ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణునే వెల్లడించారు. ఈ కథ భక్త కన్నప్ప జీవిత కథ. ముందు నాస్తికుడిగా ఉన్న కన్నప్ప.. ఆ తరువాత శివ భక్తునిగా ఎలా మారాడు. మారి శివదేవున్ని ఎలా ఆరాధించాడు అనే అంశాలను ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు సమాచారం.

భక్త కన్నప్ప చిత్ర కథ అందరికీ తెలిసిందే అయినప్పటికీ భారీ గ్రాఫిక్స్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రం మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌(Dream Project) కావడంతో ఎక్కడ తగ్గకుండా చిత్ర బృందం చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. పాన్‌ ఇండియా రేంజ్‌ లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రం నిర్మాణం రూపుదాల్చుకుంటుంది. హాలీవుడ్‌ స్థాయిలో సాంకేతిక నిపుణులు వర్క్‌ చేస్తున్నారు.

Also Read : శివరాత్రి రోజు పొరపాటున కూడా ఈ విషయాలను విస్మరించకండి..ఈ రోజున ఏం చేయాలి..ఏం చేయకూడదంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు