Watch Video: ఆలయం బయట రాహుల్ ఫొటోతో డోర్‌మ్యాట్.. వీడియో వైరల్ ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో విపక్ష నేత రాహుల్ గాంధీ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఓ హిందూ ఆలయం బయట రాహుల్ ఫొటోతో కూడిన డోర్‌మ్యాట్‌ను వాడటం దుమారం రేపుతోంది. By B Aravind 08 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Rahul Gandhi: ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ.. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఓ హిందూ ఆలయం (Maharashtra Temple) బయట రాహుల్ గాంధీ ఫొటో ఉన్న డోర్‌మ్యాట్‌ను (Door Mat) వినియోగిస్తున్నారు. హిందువులు హింసావాదులని పిలవడానికి మీకెంత ధైర్యం ? అని ఆ డోర్‌మ్యాట్‌పై హిందీలో రాశారు. ఆ ఆలయంలోకి వెళ్లే భక్తులు తలుపు బయట ఉన్న ఆ డోర్‌మ్యాట్‌ను తొక్కుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. Also Read: హెచ్‌ఐవీ నివారణకు మందు .. క్లినికల్ ట్రయల్స్‌లో 100 శాతం సక్సెస్ ఇదిలాఉండగా.. జులై 1న లోక్‌సభలో (Lok Sabha) విపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీని (BJP) తీవ్రంగా విమర్శించారు. తన ప్రసంగంలో హిందువులు అని చెప్పుకునేవారు.. హింస, విద్వేషాన్ని ప్రేరేపిస్తున్నారని వ్యాఖ్యానించారు. దీంతో ప్రధాని మోదీ (PM Modi) జోక్యం చేసుకుని రాహుల్.. హిందూ సమాజాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి మళ్లీ రాహుల్ గాంధీ స్పందిస్తూ.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మాత్రమే హిందూ సమాజం కాదంటూ కౌంటర్ ఇచ్చారు. అనంతరం సోషల్ మీడియాలో రాహుల్.. హిందువులను కించపరిచేలా మాట్లాడారంటూ విమర్శలు వచ్చాయి. మరోవైపు ఆయన మొత్తం హిందూ సమాజాన్ని అనలేదని.. కేవలం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను మాత్రమే టార్గెట్ చేసి విమర్శించారని మరికొందరు నెటిజన్లు ఆయనకు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో.. మహారాష్ట్రలో హిందూ ఆలయం గుమ్మం బయట రాహుల్ ఫొటోతో డోర్‌మ్యాట్‌ను వాడటం దుమారం రేపుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటీజన్లు విభిన్నరీతిలో స్పందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై తమ కోపాన్ని చూపించుకునేందుకు హిందువులకు హక్కు ఉందని ఈ వీడియోకు స్పందిస్తూ.. ఓ యూజర్ ట్వీట్ చేశాడు. ఇలా చేయడం సిగ్గుచేటని.. ప్రజాస్వామ్యానికి ఇది తప్పుడు సంకేతం అంటూ మరో యూజర్ ట్వీట్ చేశాడు. Also Read: సోషల్ మీడియోలో ట్రెండవుతున్న “JioBoycott” హ్యాష్‌ట్యాగ్! As a mark of protest against Rahul Gandhi's anti-Hindu statements, a temple management in Maharashtra used Rahul Gandhi's picture as a doormat. The text on doormat says, "How dare you call Hindus violent and eve teasers? Innovative idea!!!pic.twitter.com/rNPoNdSM0M — Mr Sinha (@MrSinha_) July 8, 2024 It's an extremely stupid thing to do in Temple. Temple is a place of worship and peace. Neither such person should be allowed, nor should his picture be kept anywhere near, including the floor, which is also treated as a holy place in our culture. https://t.co/UUjPH3pg9O — Goldi Agrawal (@AgrawalGoldi) July 8, 2024 #telugu-news #rahul-gandhi #maharastra మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి