Madhya Pradesh: అంత్యక్రియలు ముగిశాయి.. 13 రోజులకు తిరిగివచ్చిన వ్యక్తి మధ్యప్రదేశ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రోడ్డుప్రమాదానికి గురైన వ్యక్తికి.. అతని కుటుంబం అంత్యక్రియలు చేసింది. కానీ 13 రోజుల తర్వాత ఆ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 12 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి మధ్యప్రదేశ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రోడ్డుప్రమాదానికి గురైన వ్యక్తికి.. అతని కుటుంబం అంత్యక్రియలు చేసింది. కానీ 13 రోజుల తర్వాత ఆ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తమ కొడుకు బతికే ఉన్నాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కంగుతిన్నారు. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. షియోపూర్ జిల్లాలోని లహచోరా గ్రామానికి చెందిన సురేంద్ర శర్మ, రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ఓ క్లాత్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అయితే గత నెలలో రాజస్థాన్‌లోని సవాయ్ మధోపూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ వ్యక్తిని గుర్తించాలని కొరుతూ.. ఓ సామాజిక కార్యకర్త అతడి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వ్యక్తిని సురేంద్ర శర్మగా అతడి కుటుంబ సభ్యులు గుర్తించారు. జైపూర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించగా అతడు చికిత్స పొందుతూ మరణించాడు. పోస్టుమార్టం అనంతరం ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా.. వారు మే 28న అంత్యక్రియలు నిర్వహించారు. Also Read: డిప్యూటీ సీఎంగా పవన్.. లీక్ చేసిన అమిత్ షా, చిరంజీవి! 13 రోజుల తర్వాత సురేంద్రకు దశ దిన కర్మలు చేసేందుకు అతడి కుటుంబం రెడీ అయిపోయింది. కానీ దానికన్నా ముందురోజు ఒక ఫోన్ వచ్చింది. తాను సురేంద్రనని ఆ వ్యక్తి చెప్పాడు. ఇది నమ్మని అతని సోదరుడు వీడియో కాల్ చేయాలన్నాడు. దీంతో సురేంద్ర వీడియో కాల్ చేయడంతో.. అతడు బతికే ఉన్నాడని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాకైపోయారు. వెంటనే ఇంటికి రావాలని చెప్పారు. ఇంటికి వచ్చిన సురేంద్ర గత కొన్నిరోజులుగా తన ఫోన్ పాడైపోయినట్లు చెప్పాడు. అందుకే రెండు నెలల నుంచి ఫోన్ చేయలేకపోయానని అన్నాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని సురేంద్ర అనుకొని.. ఆ కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అతడు చనిపోవడంతో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని సురేంద్ర కుటుంబ సభ్యులు తప్పుగా గుర్తించారు. వాస్తవానికి అతను వేరే వ్యక్తి. చివరికి పోలీసులకు కూడా సురేంద్ర కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని చెప్పారు. దీంతో ప్రస్తుతం పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు. Also Read: ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది.. ‘ది క్వింట్’ కథనంలో సంచలన విషయాలు.. #telugu-news #national-news #madhya-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి